ఐ యామ్ ఎ లెజెండ్!
నటన మాత్రమే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది.
‘ఐ యామ్ ఎ లెజెండ్’ అంటుంది స్మిత్.
అపార్థం చేసుకోకండి...అది ఆ అమ్మాయి సినిమా పేరు.
తల్లిదండ్రుల వారసత్వాన్ని అందరూ పుణికి పుచ్చుకుంటారని గ్యారెంటీ ఏమీ లేదు. ‘ ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది అన్ని సందర్భాలలోనూ నిజమవుతుందనే నమ్మకం కూడా లేదు.
పదమూడు సంవత్సరాల అమెరికన్ అమ్మాయి విల్లో స్మిత్ అక్షరాల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుంది. స్మిత్ తండ్రి విల్ స్మిత్ సంగీతకారుడు, నటుడు. తల్లి జడా పింకెట్ స్మిత్ నటి.
‘ఐయామ్ ఎ లెజెండ్’ సినిమా ద్వారా హాలివుడ్‌లోకి అరంగేట్రం చేసింది స్మిత్. ఆతరువాత ‘యాన్ అమెరికన్ గర్ల్’ మొదలైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్లు అందుకుంది. నటన మాత్రే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. అవార్డ్లు కూడా గెలుచుకుంది. ఇటీవల వచ్చిన ‘రాక్ నేషన్’ ‘ఫైర్‌బాల్’ ‘ఐయామ్ మీ’ ‘డ్రౌనింగ్’ ‘5’ ఆల్బమ్‌లు స్మిత్ ప్రతిభను ప్రపంచానికి చాటాయి.
తాజాగా ‘వి’ మ్యాగజైన్ కోసం స్మిత్ చేసిన షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఆ అమ్మాయి ‘ప్యాషన్స్ సెన్స్’ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తనను తాను ప్రత్యేకంగా నిలపుకోవడానికి ‘ఫ్యాషన్’ ఉపకరిస్తుంది అంటుంది స్మిత్.
‘‘ఎవరూ ఊహించిన భిన్నత్వం నా ఫ్యాషన్‌లో కనబడాలి’’ అనేది స్మిత్ కోరిక.
‘వి’ మ్యాగజైన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది!