wife killed her husband
-
Vandana Kalita: భర్త, అత్తలను ఫ్రిడ్జ్‌లో..
ఆమె నేరం చేసినట్లయితే ఆమెను కాల్చివేయండయ్యా. అలాంటి కూతురు నాకు వద్దు. వివాహేతర సంబంధంతో భర్త, అత్తలను చంపడం ఏంటయ్యా?. ఒకవేళ నిజంగా ఆమె తన భర్తను, అత్తగారిని చంపి ఉంటే నాకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు.. తన కన్నకూతురిని ఉద్దేశించి ఓ తండ్రి చెప్తున్న మాటలివి. గువాహతి: దేశంలో జరుగుతున్న ఒక తరహా నేరాలు-ఘోరాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రేమ.. సహజీవనం.. పెళ్లిమాటొచ్చేసరికి చంపేయడం లాంటి వరుస ఘటనలు చూస్తున్నాం. ఈ నేరాలను స్ఫూర్తిగా తీసుకుందేమో.. అసోంలో ఒకావిడ భర్త, అత్తలను ఆ కేసుల తరహాలోనే హతమార్చింది. అసోం గువాహతి సమీపంలో నూన్‌మతికి చెందిన ఓ వివాహిత.. భర్త, అత్తలను కడతేర్చి ముక్కలు చేసింది. ఆ ముక్కలను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. ఆపై ప్రియుడి సాయంతో వాటిని దూరంగా పడేసి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత.. ఇది వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్తలు అడ్డువస్తున్నారనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందట. నిందితురాలి పేరు వందనా కలిటా. భర్త పేరు అమర్‌జ్యోతి దే. అత్త పేరు శంకరీ దే. కిందటి ఏడాది ఆగష్టు నెలలో వాళ్లను ప్రియుడు, మరొక వ్యక్తి సాయంతో చంపేసి ముక్కలు చేసింది వందన. ఆపై ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. మూడు రోజుల తర్వాత ప్రియుడి సాయంతో ఆ శరీర విడి భాగాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి(మేఘాలయా)కు తీసుకెళ్లి.. అక్కడ సోహ్రా ప్రాంతంలో వాటిని పడేసింది. తిరిగొచ్చి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఏడు నెలలపాటు వాళ్ల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడింది. తన కన్నతండ్రికి సైతం ఏం చెప్పకుండా ఉండిపోయింది. చివరికి.. దగ్గరి బంధువు ఒకరు అమర్, శంకరీల గురించి ఆరా తీయడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమ శైలిలో విచారణ చేపట్టారు. చివరాఖరికి.. ఫిబ్రవరి 19వ తేదీన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్ డేక, అరుప్ స్నేహితుడు ధాంజిత్ డేకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాభర్తల అదృశ్యం గురించి ఆమె(వందన) నాటకాలాడిందని, ఒకవేళ ఆమె నేరం చేసిందని రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని వందన తండ్రి పోలీసులను కోరుతున్నాడు. వివాహేతర సంబంధం తనకు భర్త, అత్తకు తెలిసిందని, వాళ్లు హెచ్చరించడంతోనే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసు, తాజాగా నిక్కీ యాదవ్ కేసులోనూ ఫ్రిడ్జ్‌లో బాడీ విడిభాగాలు, బాడీని భద్రపర్చడం తెలిసిందే. -
నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భార్య
నరసరావుపేట: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ ఘటన నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంలో జరిగింది పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన మద్దమాల చెంచయ్య (42), అన్నమ్మ దంపతులు. వారికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చెంచయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. అన్నమ్మకు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవులు జరిగేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి నిద్రపోయేందుకు అన్నమ్మ తన భర్త చెంచయ్యను డాబాపైకి తీసుకెళ్లింది. చెంచయ్య గాఢనిద్రలో ఉండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అన్నమ్మ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఒక్క సారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో చెంచయ్య పెద్దగా కేకలు వేశాడు. తండ్రి అరుపులు విని ఇంటిలో నిద్రిస్తున్న అతని కుమారుడు మనో హర్, చుట్టుపక్కల హుటాహుటిన డాబాపైకి చేరి మంటలు అర్పి, తీవ్రంగా గాయపడిన చెంచయ్యను 108 అంబులెన్స్‌లో పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో చెంచయ్య మృతిచెందాడు. చెంచయ్య కుమార్తెకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. భర్తపై పెట్రోలుపోసి నిప్పటించిన అన్నమ్మ పరారీలో ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ రోశయ్య తెలిపారు. చదవండి: ఆకు పసరు ప్రాణం తీసింది -
కట్టుకున్న వాడినే కడతేర్చింది
ఏలూరు టౌన్: వివాహేతర సంబంధం వద్దని హెచ్చరించిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ ఇల్లాలు. ప్రియుడు, అతని సహచరుడితో కలిసి పక్కా పథకం ప్రకారం అడ్డుతొలగించుకుంది. గతనెల 29న ఏలూరు శివారు దుగ్గిరాల జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వ్యక్తి దారుణ హత్యకు గురికాగా పోలీసులు 36 గంటల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. ఏలూరు తిమ్మారావుగూడేనికి చెందిన గోవాడ కృష్ణ (41) ఏలూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతని భార్య చనిపోగా భార్య చెల్లెలు (మరదలు)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు అక్షయ్ ఉన్నాడు. ఇదిలా ఉండగా మూడేళ్లుగా మనస్పర్థలతో కృష్ణ, మరియమ్మ విడిగా ఉంటున్నారు. మరియమ్మ పెదవేగి మండలం కూచింపూడిలో కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఈనేపథ్యంలో పెదవేగి మండలం అమ్మపాలెంకి చెందిన మేడంకి రాజేష్ అనే యువకుడితో మరియమ్మకు సెల్‌ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన కృష్ణ వీరిద్దరినీ పలుమార్లు మందలించాడు. తమ బంధానికి అడ్డుపడుతున్నాడనే కోçపంతో కృష్ణను హతమార్చేందుకు మరియమ్మ ప్రియుడు రాజేష్‌తో కలిసి పక్కా పథకం రచించింది. జీతం డబ్బులు ఇస్తామని నమ్మించి.. రాజేష్ ఏలూరు ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో శార్వాణీ రెడీమిక్స్ ప్లాంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తుండగా ప్లాంట్‌లోనే హెల్పర్‌గా ఉన్న వట్లూరుకు చెందిన బోడ గణేష్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి వీరు పథకం పన్నారు. మృతుడి కుమారుడు అక్షయ్ కూడా అదేచోట పనిచేస్తుండటంతో అక్షయ్‌కు రావాల్సిన జీతం ఇస్తామని.. దుగ్గిరాల జాతీయ రహదారి వద్దకు రావాలని కృష్ణను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన కృష్ణ ఉద్యోగ విధులు ముగించుకుని గత శుక్రవారం సాయంత్రం అక్కడకు వెళ్లాడు. ఉద్దేశపూర్వకంగా కృష్ణతో రాజేష్, గణేష్‌కు మార్ గొడవపడ్డారు. ఈ ఘర్షణలోనే కృష్ణను కిందపడేసి పక్కనే ఉన్న బండరాయితో తలపై బలంగా మోదారు. కృష్ణ చనిపోయాడని భావించిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ మూర్తి వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి రక్తపుమడుగులో ఉన్న కృష్టను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ ఆధ్వర్యంలో ఏలూరు త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి 36 గంటల్లోనే కేసును ఛేదించారు. త్రీటౌన్ ఎస్సై రామకోటేశ్వరరావు, పెదవేగి ఎస్సై బండి మోహనరావు, త్రీటౌన్ ఏఎస్సై రాంబాబు, హెచ్‌సీ రాధాకృష్ణ, పీసీ భాస్కరరావు, శ్రీనివాసరావు, సబ్ డివిజినల్ క్రైమ్‌పార్టీ సిబ్బంది ఏఎస్సై పూర్ణచంద్రరావు, హెచ్‌సీ సత్యనారాయణ, కానిస్టేబుల్ బాజీ, సీతయ్య తదితరులు కేసును స్వల్పకాలంలో ఛేదించి నిందితులను అరెస్టు చేయటంతో కీలకంగా వ్యవహరించారు. వీరందరినీ డీఎస్పీ దిలీప్‌కిరణ్ అభినందించారు. -
వరంగల్‌లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తను గొడ్డలితో అత్యంత దారుణంగా భార్య నరికి చంపిన ఘటన భూపాలపల్లి మండలం జంగేడు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. -
కట్టుకున్న వాడినే.... కసిదీరా చంపింది!
‘మన బంధానికి నా భర్త అడ్డుగా ఉన్నాడు. అడ్డు తొలగించుకుందాం. సాయంత్రం మామిడితోటకు నీరు పెట్టేందుకని తీసుకొస్తా. అక్కడ మట్టుపెట్టేద్దాం.’పక్కనే ఉన్నది తన భార్యే కదా అని.. ఆ భర్త మామిడితోటకు నీరు పెట్టే పనిలో నిమగ్నమయ్యూడు. ఈలోగా అతని రెండు చేతులను వెనక్కి విరిచి పట్టుకుంది ఆ ఇల్లాలు. ఇదే అదును కోసం ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు కత్తితో విచక్షణారహితంగా అతనిపై దాడి చేశాడు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను.. మరో వ్యక్తి కత్తితో పొడుస్తుంటే.. ఆ పడతి చూసి ఆనందించసాగింది. అప్పటికే ఆమె భర్త ప్రాణాలు విడిచాడు. అయినా ఆమె కసితీరలేదు. ఒక వేళ అతను ప్రాణాలతోనే ఉంటే.. తన విషయం నలుగురికీ చెబితే అన్న ఆలోచన ఆమెను మరింత క్రూరంగా మార్చేసింది. వెంటనే ప్రియుడితో కలసి అతనిని బావిలో పడేసింది. ఇదేదో సినిమాకు సంబంధించి రాసుకున్న స్క్రిప్ట్ కాదు. సినిమాను పోలి ఉన్న నిజ జీవిత ఘట్టం. పెద్దల సాక్షిగా.. వేదమంత్రాల నడుమ మనువాడిన భర్తనే కిరాతకంగా హత్య చేసింది.. చేయించింది ఆ ఇల్లాలు. విజయనగరం (బుదరాయవలస : మెరకముడిదాం) : మండలంలోని గాదెలమర్రివలసలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందరూ ఊహించినట్టుగానే కట్టుకున్న భార్యే.. ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. చీపురుపల్లి సీఐ ఎస్.రాఘవులు, బుదరాయవలస ఎస్సై కె.ప్రయోగమూర్తి ఈ కేసును కొద్దిరోజుల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సీతారాంను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గాదెలమర్రివలసకు చెందిన వలిరెడ్డి లక్ష్మి అనే వివాహితకు, ఇదే మండలం ఊటపల్లికి చెందిన పొట్నూరు సీతారామ్‌కు వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు అవుతున్నాడని భావించిన లక్ష్మి... ఎలాగైనా భర్త వలిరెడ్డి శ్రీనును హతమార్చాలని నిశ్చయిచుకుంది. ఈ నెల 21వ తేదీన ప్రియుడు సీతారామ్‌కు ఫోన్ చేసింది. ‘మధ్యాహ్నం మామిడితోటకు నీరు పెడదామని నా భర్త శ్రీనును తీసుకొస్తాను. నువ్వు అక్కడికి వస్తే ఇద్దరమూ కలసి అతనిని చంపేద్దామ’ని చెప్పింది. అనుకున్నట్లగానే భర్తను మామిడితోటకు తీసుకెళ్లింది. సాయంత్రం 4.30 సమయంలో మామిడిమొక్కలకు శ్రీను నీరు పోస్తున్నాడు. అదే సమయంలో సీతారామ్ అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న లక్ష్మి.. భర్త శ్రీనును వెనుక నుంచి గట్టిగా పట్టుకుంది. వెంటనే సీతారాం కత్తితో శ్రీను తలపై నరికేందుకు ప్రయత్నించాడు. శ్రీను విడిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. వీరిద్దరూ వదలకుండా కత్తితో తలపై బలంగా మోదారు. దీంతో అతనుఅక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఇద్దరూ మామిడిమొక్కలకు నీరు పోసేందుకు తీసుకువచ్చిన కావిడికి ఉన్న కట్టికి శ్రీనును కట్టారు. సమీపంలో ఉన్న బావి వద్దకు తోడ్కొని వెళ్లారు. బావిలో శ్రీనును పడేశారు. చనిపోయూడన్న నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయూరు. శ్రీను ఆచూకీ లేకపోవడంతో బంధువులు వెతకడం మొదలుపెట్టారు. సీతారాంపురం గ్రామసమీపంలో ఉన్న నేలబావిలో అతను విగతజీవై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చీపురుపల్లి సీఐ ఎస్.రాఘవులు, బుదరాయవలస ఎస్సై కె.ప్రయోగమూర్తి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై బలమైన గాయూలు ఉండడంతో ఎవరో హత్య చేసి ఉంటారని నిర్ధారించుకున్నారు. మృతుడు భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం ఆమె ప్రియుడు సీతారామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితులు చేసిన నేరం ఒప్పుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలకు అభినందించారు. -
భర్తను వేట కొడవలితో నరికి చంపిన భార్య
-
భర్తను వేట కొడవలితో నరికి చంపిన భార్య
కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే...ఓ భార్య దారుణంగా హతమార్చిన సంఘటన కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్త గొల్ల సంజన్నను ... భార్య చిట్టెమ్మ వేట కొడవలితో నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గత అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ అలికిడి విని లేచిన సొంత తల్లిని కూడా ఆమె వదలలేదు. తల్లి లక్ష్మీదేవిపైనా దాడి చేసింది. కాగా చిట్టెమ్మ, సంజన్న తరచూ గొడవపడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన లక్ష్మీదేవి ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. కాగా కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. -
భర్తను హత్యచేసి కనిపించలేదని ఫిర్యాదు
వేలూరు, న్యూస్‌లైన్: స్నేహితుడి మోజులోపడి భర్తను కడతేర్చి, కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలయం వద్ద ఈనెల 9న మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో మృతు డు క్రిష్ణగిరి జిల్లా చిన్నరామనూర్ గ్రామానికి చెందిన సోమసుందరం(37)అని తెలిసింది. ఇతనికి భార్య కస్తూరి, నలుగురు పిల్లలున్నారు. సోమసుందరం కమ్మీ మేస్త్రీగా పనిచేసి ప్రతిరోజూ మద్యం సేవించే వాడు.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గోవిందరాజ్‌తో కస్తూరికి వివాహేత ర సంబంధం ఏర్పడింది. ఈ విషయం విషయం తెలిసి సోమసుందరం ప్రతిరోజూ మద్యం సేవిం చి కస్తూరితో గొడవపడేవాడు. దీంతో గోవిందరా జ్, కస్తూరి కలిసి సోమసుందరాన్ని హత్య చేసేం దుకు ప్రణాళిక సిద్ధ్దం చేసుకున్నారు. మద్యం మానిపించేందుకు గుడియాత్తంలో మందులు ఇస్తారని కస్తూరి, సోమసుందరాన్ని ఒంటరిగా తీసుకొచ్చింది. అనంతరం గుడియాత్తం చిత్తాతూర్ వద్దనున్న కొబ్బరి తోపునకు తీసుకెళ్లింది. అప్పటికే గోవింద్రాజ్ అక్కడ ఉన్నాడు. కస్తూరి, గోవింద్రాజ్ ఇద్దరు కలిసి సెల్‌ఫోన్ చార్జర్‌తో గొంతు బిగించి హత్యచేసినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. పోలీసులు కస్తూరి, గోవిందరాజ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.