ఇద్దరు వేటగాళ్ల అరెస్టు
నాటు తుపాకులతో అటవి జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డుబండ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం.