వ్యక్తి మృతి కేసులో ఇద్దరి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ఊర్వశి వైన్స్ వద్ద జరిగిన గలాటాలో ఒక వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. సుబ్బారావుపేటకు చెందిన భీమవరపు సత్తిబాబు, పడాలకు చెందిన కాట్రగడ్డ కృపారావును చిన్న వంతెన సమీపంలో సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు పంపగా, మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.