బెల్ట్ షాపు మూసేయమన్న మహిళలపై...
సాక్షి, భువనేశ్వర్: బెల్ట్ షాపులను వ్యతిరేకిస్తున్న మహిళా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఒడిషాలోని కేంద్రప్పాడా గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామంలోని ఉన్న ఓ వైన్ షాపును మూసేయాలంటూ మహిళలతో కలిసి పలువురు కార్యకర్తలు ధర్నాకు దిగారు. మద్యానికి బానిసలైన తమ పిల్లలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారంతా నినందించారు. అయితే ఆందోళనలను కట్టడి చేసేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. లాఠీఛార్జీ చేయటంతో పలువురు మహిళలు గాయపడ్డారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై మహిళలంతా విరుచుకుపడుతున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.