పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఆర్కే భార్య
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) క్షేమంగా ఉన్నారనే సమాచారం అందడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఏవోబీ ఎన్కౌంటర్ అనంతరం ఆర్కే కనిపించకుండా పోవడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్కే సమాచారం తెలియడంతో ఈ రోజు తన తరఫు న్యాయవాది ద్వారా న్యాయస్థానాన్ని పిటిషన్ విత్డ్రా అనుమతి కోరారు.