Woman abducted
-
పబ్లిక్‌గా ఇంట్లోంచి వివాహితను లాక్కెళ్లి..
గురుగ్రామ్: దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో హరియాణాలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఘోర సంఘటన జరిగింది. బద్షాపూర్ అనే గ్రామంలో అందరూ చూస్తుండగానే ముగ్గురు దుండగులు ఓ వివాహిత (29) బలవంతంగా ఇంట్లోనుంచి లాక్కొచ్చి, బైకుపై తీసుకెళ్లారు. ఇరుగుపొరుగు వారు కనీసం అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. ఆ సమయంలో బాధితురాలు ఒక్కతే ఇంట్లో ఉంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆమె తండ్రి ఉద్యోగానికి వెళ్లగా, తల్లి ఆస్పత్రికి వెళ్లింది. దుండుగులు ఆమెను బైకుపై కొండప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారు. నెలరోజుల క్రితం నిందితులు ఆమెను వేధించడంతో పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామపెద్దల జోక్యం ముగ్గురూ బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. ఆమె ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టినా, నిందితులు ప్రతీకారంతో ఆమె జీవితాన్ని నాశనం చేశారు. -
వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
దేవ్ గఢ్: జార్ఖండ్ లోని దేవ్ గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వివాహితను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వివాహిత(25), తండ్రితో కలిసి గురువారం గిరిద్-మాదాపూర్ ప్యాసింజర్ రైళ్లో ప్రయానిస్తోంది. రైలు మాదాపూర్ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైళ్లో ప్రయాణిస్తోన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని రైల్వే ఎస్పీ అసీమ్ విక్రాంత్ మింజ్ తెలిపారు. మాదాపూర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే ఆయనకు మెలకువ వచ్చింది. ఎంత వెతికినా కూతురు కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదుచేశాడు. కిడ్నాప్ జరిగిన సమయంలో కూతురు కూడా నిద్రలో ఉన్నట్లు ఫిర్యాదులో ఆమె తండ్రి పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు దంగల్ పుర ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఓ మహిళను గుర్తించినట్లు చెప్పారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వివాహితను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. -
మహిళ కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. నిందితులను శిక్షించేందుకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన మహిళలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతునే ఉన్నాయి. అందుకు ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనే తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.... రాష్ట్రంలోని లలిత్‌పూర్‌లో ఓ యువతి ప్రభుత్వేతర సంస్థలో విధులు నిర్వర్తిస్తుంది. ఆ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాంతో బాధితురాలు లలిత్పూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మనోజ్ సమయ్య, బబ్లూ, మరోకరని పోలీసులు నిందితులను గుర్తుంచారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.