మహిళా మావోయిస్టు అరెస్టు
కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలె రాయ్ పూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులను ఏరివేసే చర్యల్లో భాగంగా బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు ఉమ్మడిగా గాలింపులు చేపడుతుండగా ఆయుధాలతో కొందరు మావోయిస్టులు తారసపడ్డారు.
అయితే, ఎలాంటి కాల్పులు జరపకుండానే వారు పారిపోతుండగా వెంబడించిన బలగాలు వారిలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాంకేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖాడ్కా గ్రామం సమీపంలో ఆమె పట్టుబడింది. ఆ మావోయిస్టు ఎవరనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.