women beneficiaries
-
అభిమానానికి హద్దు లేదు..!
-
మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం లబ్ధి పొందినట్లే..
సాక్షి, అమరావతి: మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం అంతా లబ్ధి పొందినట్లేనని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో 100 శాతం సంతృప్తి సాధ్యం కాదని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం ఆ స్థలాలు పొందిన వారందరిపై పడుతుందని స్పష్టంచేసింది.తీర్పునిచ్చే ముందు వారందరికీ సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసి వారి వాదనలు కూడా విని ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడింది. మహిళల వాదనలు విని ఉంటే సహజ న్యాయ సూత్రాలను అనుసరించినట్లు ఉండేదని వ్యాఖ్యానించింది. వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్ శ్రీరామ్ పలు విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికే వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దంటూ జస్టిస్ సత్యనారాయణమూర్తి గత నెలలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి వద్ద 128 మంది కలిసి ఓ పిటిషన్ వేశారని, వారిలో 51 మంది మహిళలే ఉన్నారని ఏజీ తెలిపారు. మహిళలకు పట్టాలివ్వడాన్ని మహిళలే సవాలు చేయడం సందేహాస్పదంగా ఉందన్నారు. కుటుంబంలో మహిళలు లేకుంటే పురుషులకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ఇది తమ హామీ అని ఏజీ చెప్పారు. మహిళలు దరఖాస్తు చేయని కుటుంబాల్లో 77వేల మంది పురుషులకు పట్టాలు ఇచ్చామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలకు లోబడే మహిళలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూ సేకరణ కోసం రూ.10 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని ఎన్నో విషయాలను సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారి వాదనలు వినకుండానే ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. పేదలకు బంగ్లా కట్టించాలన్నది ప్రభుత్వ కల అని, అయితే ఆ కల ఆచరణ సాధ్యం కాదని వివరించారు. మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి వివక్ష గానీ, నిబంధనల ఉల్లంఘన గానీ జరగలేదని చెప్పారు. 24వీఐడబ్ల్యూ40: పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న సిబ్బంది -
114- 532 ఏళ్ల మహిళలకు ముఖ్యమంత్రి సాయం!!
ముఖ్యమంత్రి సిలాయీ యోజన, ముఖ్యమంత్రి సైకిల్ సహాయతా యోజన.. ఈ రెండూ ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆర్భాటంగా ప్రారంభించిన రెండు పథకాలు. ఇంతకీ వీటి లబ్ధిదారుల సగటు వయసెంతో తెలుసా.. 200 నుంచి 500 సంవత్సరాలు!! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న మహిళలకు కూడా గట్టిగా 115 ఏళ్లు లేని ఈ సమయంలో ఇంత పెద్దవాళ్లు ఎక్కడినుంచి వచ్చారని అనుకుంటున్నారా? ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు మచ్చుతునక ఇది. దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన ఈ పథకాలు ఎంతలా తప్పదోవ పట్టాయో సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో బట్టబయలైంది. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కూలీలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సైకిళ్లు పంచిపెట్టాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలను సీఎం రమణ్ సింగ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.15 లక్షల మంది మహిళలు ఈ పథకాల్లో లబ్ధి పొందినట్లు చూపించారు. సైకిళ్లు పొందాలనుకునేవారికి 18-35 ఏళ్లు, కుట్టు మిషన్లు పొందాలనుకునేవాళ్లకు 35-60 ఏళ్ల మధ్య వయసుండాలని నిబంధన పెట్టారు. కానీ, లబ్ధి పొందిన వారి వివరాలు ఇవ్వాలంటూ సంజీవ్ అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా.. విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. మొత్తం 19,399 కుట్టుమిషన్లు పంచిపెట్టగా, ఆ లబ్ధిదారుల్లో 6,189 మంది వయసు 114 ఏళ్లుగా చూపించారు. అంతేకాదు.. ఆరుగురికి 202 ఏళ్లు ఉన్నాయని, ముగ్గురికి 212 ఏళ్లు, ఇద్దరికి 282 ఏళ్లు ఉన్నాయని జాబితాలో ఉంది. 300 ఏళ్ల పైబడిన వాళ్లు కూడా 14 మంది ఉన్నారు, ఏడుగురైతే 400 ఏళ్లు దాటి ఉన్నారు. అందరికంటే అత్యధిక వయస్కురాలు 532 ఏళ్ల మహిళ అట!! ఇలా చాలా మంది పేర్లతో ఈ కుట్టు మిషన్లు, సైకిళ్లను పక్కదోవ పట్టించినట్లు బయటపడింది.