women bike riding club
-
శౌర్య యాత్ర.. 40 మంది మహిళలా సైనికులు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు..!
నిత్య ఉత్తేజం చే గువేరా ‘మోటర్ సైకిల్ డైరీస్’లో ఒక మాట... ‘ప్రపంచం నిన్ను మార్చే అవకాశం ఇవ్వు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని మార్చే దిశగా ప్రయాణిస్తావు’ ప్రయాణం అనేది పైకి భౌగోళిక అంశాలకు సంబంధించిన విషయంగా కనిపించినప్పటికీ, సూక్ష్మదృష్టితో చూస్తే... అది మనలోకి మనం ప్రయాణించడం. ప్రయాణ క్రమంలో కొత్త విషయాలను నేర్చుకోవడం. మన దగ్గర ఉన్న విషయాలను పంచుతూ వెళ్లడం. రక్తం గడ్డ కట్టే చలిలో జమ్మూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డేగకళ్లతో కాపుకాసి, ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదారులకు చెక్ పెట్టిన మహిళా సైనికుల ధీరత్వం ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. ఎర్రటి ఎండల్లో, నాలుక పిడచకట్టుకుపోయే భయానక వేడిలో రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మహిళా సైనికుల అంకితభావం ఎప్పటికీ గుర్తుంటుంది. విధినిర్వహణలో కాలప్రతికూలతలు, భౌగోళిక ప్రతికూలతలను అధిగమించి ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధి అయిన నిర్వహించగలం’ అని నిరూపించారు బీఎస్ఎఫ్ మహిళా సైనికులు. రాజస్థాన్‌కు చెందిన తనుశ్రీ ప్రతీక్ బీఎస్ఎఫ్ చరిత్రలో ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఆఫీసర్‌గా నియామకం అయినప్పడు అది ఒక విశేషం మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలకు విశిష్టమైన ఉత్తేజాన్ని అందించింది. మొన్నటి దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో బీఎస్ఎఫ్ మహిళా దళం ‘సీమ భవాని’ చేసిన అపురూప సాహసిక విన్యాసాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఇవేమీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవడం లేదు. ఒక కొత్తదారికి ఊతం ఇవ్వబోతున్నాయి. తాజా విషయానికి వస్తే.. బీఎస్ఎఫ్కు చెందిన నలభైమంది మహిళా సైనికులు దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు బైక్ యాత్ర చేపట్టారు. 5,280 కి.మీ ఈ యాత్రకు ‘సీమా భవాని శౌర్య ఎంపవర్మెంట్ రైడ్–2022’ అని నామకరణం చేశారు. అటు అమృత్సర్ నుంచి ఇటు చెన్నై, హైదరాబాద్, అనంతపురం, బెంగుళూరు వరకు స్త్రీ సాధికారికతకు సంబంధించిన ఘట్టాలను పంచుకుంటూ, సానుకూల దృక్పథాన్ని రేకెత్తించడమే ఈ యాత్ర లక్ష్యం. యాత్రలో భాగంగా బృంద సభ్యులు పాఠాశాల, కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ వాలెంటీర్లు, బైక్‌రైడర్స్... మొదలైన వారితో సమావేశం అవుతారు. దిల్లీకి సమీపంలోని ఒక పాఠశాల విద్యార్థులతో సమావేశం అయినప్పుడు... మొన్నటి రిపబ్లిక్‌డే వేడుకల్లో సీమభవాని బృందం చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంది ఒక చిన్నారి. తాను కూడా అలా చేయాలనుకుంటుదట! ‘నువ్వు కచ్చితంగా చేయగలవు’ అని చెప్పినప్పుడు ఆ పాప ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో! మరోచోట ఒక కాలేజీ విద్యార్థిని ‘బీఎస్ఎఫ్లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏం చదవాలి?’... మొదలైన విషయాలను అడిగింది. ఆ అమ్మాయికి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది రైడర్స్ గ్రూప్. దూరాలను అధిగమించడమే కాదు... దూరాలను తగ్గించడం కూడా ఈ యాత్ర లక్ష్యం. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై రాజసంగా కనిపిస్తున్న సీమ భవానీ శక్తులను ఒక్కసారి చూడండి... ఎంత ఉత్తేజకరమైన దృశ్యమో! -
డేర్ డెవిల్స్..ఈ లేడీ రైడర్స్!
బైక్.. మగాడి వాహనం! పురుషుడి దర్పానికి ప్రతిరూపం!! రఫ్గాఉండే బండి ఎక్కి రివ్వున దూసుకుపోవడం మగానుభావుడిమనో నిబ్బరానికి నిదర్శనం!!!.. ఏ ప్రకటన చూసినా ఇంతే కదూ.ఏ మూవీకి వెళ్లినా ఇదే ముద్ర కదూ.. బుల్ వంటి బైక్ మగువకు బహుదూరం కదూ! కాదూ కాదని నిరూపించారు ఆ నలుగురు లేడీ రైడర్స్.పొగరుబోతు బైక్ కొమ్ములు వంచే సత్తా ఇంతికీ ఉందని చాలెంజింగ్‌గా రుజువు చేశారు. బైక్ ఎక్కి బలాదూర్‌గా తిరిగి తామూ దమ్మున్నవాళ్లమేనని దుమ్ము రేపేట్టు చూపారు. అంతేనా.. అంతే అయితే.. అక్కడితోఆగితే... వారు ఈ జనరేషన్ జవ్వనులెందుకవుతారు? అందుకే.. తొలిసారిగా బైక్‌లపై దేశ సరిహద్దులు దాటుతున్నారు. హైదరాబాద్లోబయల్దేరి వేల కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా మయన్మార్..అక్కడి నుంచి లావోస్ వెళ్లి భారత కీర్తి పతాకను ఉత్తేజంతో ఎగరేయాలనిసంకల్పించారు. ఈ దేశపు ఆడబిడ్డలు దమ్ములో, ధైర్యంలో టాప్ గేర్లోఉంటారని సగర్వంగా రుజువు చేయదలచుకున్నారు. ఆ నలుగురూమార్గమధ్యంలో విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖ స్పోర్ట్స్: జయ.. పియా.. శిల్పా.. శాంతి. ఎందరో అమ్మాయిల్లా సాధారణ వనితలే. మామూలు కుటుంబాల నుంచి వచ్చి.. బరువు బాధ్యతలు మోసి.. మెప్పు పొందిన మామూలు మగువలే. అయితే.. అది తమకు సరైన గుర్తింపు కాదనుకున్నారు వాళ్లు. థింక్ డిఫరెంట్ అనుకున్నారు ఎవరికి వాళ్లు. ఏదో చేయాలన్న తపన నడిపిస్తే.. తమలో అంతర్లీనంగా ఉన్న సత్తాకు పదును పెట్టి శభాష్ అనిపించుకోవాలన్న ఆరాటం కెరటంలా ఉరకలేస్తే.. కొత్త బాట పట్టాలని సంకల్పించుకున్నారు. అడ్డుగోడలు పడగొట్టి, పాత భావాల బూజు పక్కన పెట్టి ఉరకలేశారు.. ఇప్పుడు ఆ నలుగురూ.. మగాళ్లే వారేవా అనే విధంగా మయన్మార్ వైపు బైక్‌లపై దూసుకుపోతున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా బైక్‌లపై సరిహద్దులు దాటిన మగువలన్న ఖ్యాతిని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాతకు పాతరేసి.. : స్కూటీనో.. స్కూటరెట్నో.. అమ్మాయిలకు బెస్ట్. అంతకుమించి హెవీ వెహికిల్ ఆడాళ్లకెందుకూ.. అనేది సమాజంతో స్థిరపడ్డ ఓ ఫినామినా. దాన్ని వారు భరించలేరన్న ‘జాలి’(!) ఫీలింగ్ కూడా ఉంది. దీన్ని తుడిచిపెట్టాలన్న సంకల్పంతో బైక్‌లపై చక్కర్లు కొట్టడం మొదలెట్టారు ఈ నలుగురూ. హైదరాబాద్‌లో పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా.. అర్థరాత్రి.. అపరాత్రి అన్న భయం లేకుండా బైక్లెక్కి దూసుకుపోయారు. అయితే అంతా భయపడేట్టు ఎక్కడా తమకు ‘అవాంఛనీయ’ పరిణామాలు ఎదురు కాలేదని నవ్వుతూ చెప్పారు వీరు. ఈ ప్రయాణాల తర్వాత ఇంతకన్నా భిన్నమైనదేదో చేయాలన్న పట్టుదల కలిగిందని, దాంతో సరిహద్దులు దాటే సంకల్పానికి బీజం పడిందని చెప్పారు. విభిన్న జీవనాలు : ‘మేం నలుగురం వేరు వేరు వృత్తుల్లో స్థిరపడ్డాం. అయితే నలుగురిలో కామన్‌గా ఉన్నది బైక్‌లంటే వ్యామోహం. దూరాలు తరించాలన్న సంకల్పం. ఈ ఉత్సాహం మమ్మల్ని సాహస యాత్ర బాట పట్టించింది. ఈనెల 11న మా యాత్ర మొదలైంది. 18న మా బృందం మయన్మార్ చేరుకోనుంది. మార్చి 24న స్వస్థలాలకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.’ అన్నారు టీం కెప్టెన్ జయభారతి. మొత్తంగా పదిహేడు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని, హైదరాబాద్‌లో ప్రారంభమైన యాత్ర అమరావతి మీదుగా సాగుతోందని సోమవారం విశాఖ చేరుకున్న సందర్భంగా ఆమె తెలిపారు. భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన స్దలాలను బయటి దేశాల వారికి పరిచయం చేయడమే లక్ష్యంగా పయనిస్తున్నట్టు తెలిపారు. వైజాగ్.. బ్యూటిఫుల్ : ‘హైదరాబాద్‌లో చారిత్రాత్మక కట్టడాలున్నాయి. కాని విశాఖలో సహజసిద్ధమైన సాగరతీరం ఉంది. 25 కిలోమీటర్ల మేర సాగరతీరం వెంట రహదారి ఉంది. బైక్ రైడ్ ఈదారిలో చాలా బాగుంది. భారత్‌లో యునెస్కొ గుర్తింపు పొందిన స్థలాలు 35 ఉన్నాయనే విషయం చాలా మందికి తెలీదు. మా యాత్రలో యునెస్కొ గుర్తింపు పొందిన 19 స్థలాలు దర్శిస్తాం. అక్కడ వారికి భారత్ దేశ గొప్పతనాన్ని వివరిస్తాం’ అని వీరు చెప్పారు. ఒక్కొక్కరూ తమ మనోభావాలను ఇలా పంచుకున్నారు. శిక్షకులూ వీరే సరదాగా వారికి బైక్ రైడింగ్ చేయడం హాబీ అనుకున్న ఈ నలుగురూ కొంత కాలానికి శిక్షకులుగా మారారు. ప్రతి శనివారం హైదరాబాద్‌లో విద్యార్థినులకు బైక్ నడపడంలో శిక్షణ ఇచ్చారు. తొలుత 20మందికి శిక్షణఇస్తే చాలనుకున్నారు. తొలి ఏడాదిలోనే 200 మంది అమ్మాయిలకు శిక్షణ నిచ్చారు. గడిచిన ఐదేళ్ళలో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎనిమిది శనివారాల పాటు ఇలా శిక్షణ ఇచ్చారు. ఆత్మ రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. నాన్న స్ఫూర్తి మన దేశ సౌందర్యం గురించి బయటి ప్రపంచానికి తెలియాలి. అందుకే ఈ యాత్ర. ఇలా విదేశానికి బైక్‌పైనే వెళ్లాలని అనుకోవడానికి నా తండ్రి స్ఫూర్తి. 1979లో నా తండ్రి ఇలానే బైక్‌పై పారిస్ వెళ్లారు. ఇప్పుడు నా సహచరులతో బైక్‌పై బయలుదేరాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు న్నారు. వారు ప్రోత్సహిస్తేనే ఈ యాత్రకు పూనుకున్నాను. –పియా బహదూర్ ఎక్కడైనా నో ప్రాబ్లమ్ బైక్‌పై ప్రయాణం ఓ అనుభూతి. బైక్ రైడింగ్ అనేది మహిళలకు సేఫ్ కాదనడం సరికాదు. ఈశాన్య రాష్ట్రాలలోనూ ప్రయాణం చేశాను. ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదు. అమ్మాయిలకు చాలా అవకాశాలున్నాయి. భయం వీడాలి. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. రెండు సార్లు దేశంలోని నలుమూలలకు ప్రయాణం చేశాను. – శిల్పా బాలకృష్ణన్ ఇదో కొత్త అనుభూతి.. వృత్తి రీత్యా పోలీస్‌ను. సాహసయాత్ర చేయడం...బైక్‌పై దూసుకుపోవడం ఎంతో ఇష్టం. నలుగురం కలిసి బైక్‌పై ప్రయాణం చేయాలని కొన్ని నెలలుగా అనుకుంటూ ప్రణాళిక తీర్చిదిద్దాం. భారత ఉప ఖండంలో సాహసయాత్ర చేయడం గొప్ప అనుభూతి. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడితే అన్ని సుసాధ్యమే అని చెప్పడమే మా లక్ష్యం. – శాంతి ఆత్మ విశ్వాసం ముఖ్యం ‘మగువలు బైక్‌పై వెళ్లడం అంతా సేఫ్ కాదు అనడం తగదు. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే నో ప్రాబ్లమ్. గత ఐదేళ్ళుగా హైదరాబాద్‌లో రాత్రి సయితం బైక్‌పైనే విహరించి మేం దీనిని నిరూపించాం. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్నయినా బైక్‌పై ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైక్ యాత్ర చేశాం. ప్రస్తుతం దేశం దాటి మయన్మార్, కంబోడియా, «బంగ్లాదేశ్, లావోస్ వెళ్ళేందుకు పదిహేడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాం. – టీమ్ లీడర్జయభారతి -
మేము ఇవీ నడపగలం!
బజారుకెళ్లడమే తెలియని రోజుల నుంచి మహిళలు బండిపై తిరిగే రోజులకు వచ్చేశాం. టూ వీలర్, ఫోర్ వీలర్, బస్సు, రైలు....అన్నీ నడిపేస్తున్నారు. అన్నీ కూడా ఉపాధి పేరుతోనో, అవసరం కోసమో చేస్తున్నవే. కానీ బైక్ రైడింగ్ మహిళల కోటాలోకి వస్తుందా? అదీ మగవాళ్లు నడిపే బళ్లపై అలా సరదాగా రోడ్డుపై చక్కర్లు కొట్టగలరా? ఎందుకు చేయలేమంటూ ఎంతోమంది మహిళలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’లోని మహిళల్ని పలకరిస్తే ఆసక్తిర విషయాలెన్నో తెలుస్తాయి. ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని మొదట పుణేలో ‘ఊర్వశీపాటిల్’ అనే మహిళ మొదలుపెట్టారు. ఆమెకు చిన్నప్పటి నుంచి గేర్బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక పట్టుదలతో నేర్చుకుంది. గేర్బైక్పై ఊర్వశి రోడ్డుపై వెళుతుంటే చాలామంది అమ్మాయిలు ముందు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు ఆదర్శంగా తీసుకుని వారు కూడా గేర్బైక్లను నడపడానికి ప్రయత్నించారు. ఊర్వశీపాటిల్ను మిగతా మహిళలు అనుసరించడాన్ని పురుషులెవరూ ప్రోత్సహించలేదు. ఎవర్నీ లెక్కచేయకుండా ఊర్వశీపాటిల్ 2011లో ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని ఏర్పాటు చేశారు. గేర్ బైక్ నడపడం వచ్చిన మహిళల్ని అందులో చేర్చుకున్నారు. ఆమె గురించి వచ్చిన వార్తాకథనాలకు స్పందించిన ఇతర నగరాల్లోని మహిళలు కూడా ఎవరికి వారు ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’లను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో... గత ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం రోజు ఇక్కడ జయభారతి అనే ఆర్కిటెక్ట్ ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్‌ని స్థాపించారు. ‘‘క్లబ్ అంటే ఆఫీసులాంటిది ఏమీ ఉండదు. కేవలం సభ్యులకు ఇచ్చే గుర్తింపు మాత్రమే అది. మొదట ఆరుగురితో ఇక్కడ క్లబ్‌ని ఏర్పాటు చేశాను. ప్రసన్న, అమూల్య, రుజుత, సన, నిక్కి, హర్షితలతో ఆ రోజు అనంతగిరి నుంచి వికారాబాద్ వరకూ 80 కిలోమీటర్లు రైడ్ చేశాం. నాకు తెలిసి మన నగరంలో అదే మొదటిసారి అనుకుంటా ఓ నలుగురు ఆడవాళ్లు కలిసి గేర్ బైక్‌లు నడపడం’’ అని జయభారతి చెప్పారు. ‘‘మేము అలా బైక్స్‌మీద రోడ్డుపై వెళుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అమ్మాయిలైతే వింతగా వింతగా చూసిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది’’ అని గుర్తుచేసుకున్నారు జయభారతి. దేనికోసం... ఏ పనిచేయాలన్నా బలమైన కారణమో, ప్రయోజనమో ఉండాలి. మనదగ్గర ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’ వెనకున్న విషయం ఏమిటని అడిగితే ఓ ప్రైవేటు కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్న ప్రసన్న మాట్లాడుతూ...‘‘ఎన్ని రంగాల్లో తన ప్రతిభను చాటినా...ఇంకా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాల్సిన అవసరం చాలా ఉంది. మా బైక్ రైడింగ్ దానికి ఎంతోకొంత ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఆడవాళ్ల బళ్లను నడపడానికి భయపడుతున్నారు. అలాంటివారు గేర్బళ్లపై మహిళల్ని చూస్తే వారి అపోహల్ని పోగొట్టుకోవచ్చు’’ అని చెప్పారు ప్రసన్న. కేవలం రోడ్లపై నడిచేవారికి తమలోని ఆత్మవిశ్వాసాన్ని చాటుకోవడం కోసమే వీళ్లు రైడ్ చేయడం లేదు. గత నెలలో ఓ స్వచ్ఛందసంస్థ వారు ‘సేవ్ గర్ల్ చైల్డ్’పై ఒక ర్యాలీ చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్లు ‘ఉమెన్ బైక్ రైడింగ్ క్లబ్’ని సంప్రదించడంతో వెంటనే ఒప్పుకుని కొందరు అబ్బాయిల్ని కూడా కలుపుకుని ఓ అరవైమంది సికింద్రాబాద్ దగ్గర బైక్ ర్యాలీ చేశారు. ప్రస్తుతం పదిహేనుమందితో కొనసాగుతున్న ఈ క్లబ్లో చేరాలంటే మీక్కూడ గేర్బైక్ నడపడం వస్తే చాలు. ప్రతి నెల వీకెండ్లో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న ఈ క్లబ్మెంబర్స్తో పాటు మీరు కలిసి ప్రయాణించవచ్చు. ఆసక్తి ఉన్నవారు ్జ్చజీఛజ్చిట్చ్టజిజీఃజఝ్చజీ.ఛిౌఝను సంప్రదించవచ్చు. - భువనేశ్వరి