Women Kidnaped
-
సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్.. అర్ధరాత్రి 15 మంది ఇంట్లో దూరి..
అర్ధరాత్రి ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలుకొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందుతులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మైలాడుతురైలో చెందిన ఓ యువతి(24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్‌కు కొద్ది రోజుల కిత్రం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నేశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విఘ్నేశ్వరన్‌కు విడుదల చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో, నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 15 మంది కలిసి ఆమె ఇంటి గేటును బద్దలుకొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. Fifteen men kidnap woman from her residence in Mayiladuthurai, Tamilnadu! pic.twitter.com/WCK1AFdW7l — karthik gopinath (@karthikgnath) August 3, 2022 -
యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కిడ్నాప్ అయిన బీఫార్మసీ విద్యార్థిని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అపహరణకు గురై 24 గంటలు గడుస్తున్నా ఇంకా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందుతుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసు దర్యాప్తును స్వయంగా పరివేక్షిస్తున్న ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్.. యువతి తండ్రి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే యువతి ఆచూకీ తెలుసుకొని కుటుంబానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. -
చిట్టీ డబ్బులు కట్టడం లేదంటూ..
మహిళను అపహరించిన నిర్వాహకులు నిర్బంధించి.. వేధింపులకు గురిచేసిన వైనం పోలీసులు, మీడియా సాయంతో బయటపడిన మహిళ కొత్తగూడెం(ఖమ్మం): చిట్టీ డబ్బుల కోసం ఓ వివాహితను అపహరించి.. మానసిక, శారీరక వేధింపులకు గురిచేయగా.. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు, మీడియా సహకారంతో విముక్తి లభించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్కే.అక్బర్ అనే ఆటో డ్రైవర్.. భార్య రజియా, పిల్లలతో కలిసి 2013లో కొత్తగూడెం మండలం రామాంజనేయ కాలనీలో నివాసం ఉండేవాడు. కాగా.. ఆ సమయంలో ఆటో కొనుగోలు కోసం అక్బర్.. హుస్సేన్‌బీ వద్ద రూ.లక్ష విలువచేసే చిట్టీ వేశాడు. అవసరాల నిమిత్తం పాటపాడి ఎత్తుకున్నాడు. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అక్బర్ కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే చిట్టీ డబ్బులు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోకుండా వారిపై చిట్టీ నిర్వాహకురాలు హుస్సేన్‌బీ, పెద్ద హుస్సేన్‌బీ, చిన్న హుస్సేన్‌బీ, యాకూబీ, ఎస్డీ.నుజ్జు తదితరులు ఖమ్మం వెళ్లి చిట్టీ డబ్బుల నిమిత్తం తరచూ అక్బర్, భార్య రజియాతో ఘర్షణ పడుతుండేవారు. ఈనెల 6న అక్బర్ ఆటో నడిపేందుకు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఆరా తీయగా.. హుస్సేన్‌బీతోపాటు పలువురు ఖమ్మం వచ్చి రజియాను అపహరించి కొత్తగూడెం తీసుకొచ్చారని.. గృహ నిర్బంధం చేశారని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బీతోపాటు మిగతా వారంతా కలిసి రజియాను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ భర్త స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకుని హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లగా.. రజియాను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో రజియా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు వెల్లడించింది. హుస్సేన్‌బీ, ఆమె కూతుళ్లతోపాటు నరసమ్మ, జగదీష్, మధు తనను వేధించారని పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.