women kidnapped
-
మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ట్యూషన్ టీచర్.. ట్విస్ట్ ఏంటంటే..
చండీఘడ్: కరోనా పుణ్యాన అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. పిల్లలు బడికి వెళ్లడం మానేసి అరచేతిలోనే ఆన్లైన్ పాఠాలు నేర్చుకుంటున్నారు. మరికొందరు ట్యూషన్ టీచర్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్యూషన్ టీచర్ విద్యార్థిని తీసుకుని పారిపోయిన ఘటన చండీఘడ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.. పానిపట్‌కు చెందిన ఓ కుటుంబం, తమ 17 ఏళ్ల కుమారునికి ట్యూషన్ చెప్పడానికి 20 ఏళ్ల వయసున్న మహిళా టీచర్‌ను నియమించింది. ఆమె గత మూడు నెలల నుంచి నిత్యం ఆమె ఇంటిలో అతడికి ట్యూషన్ చెబుతోంది. ప్రతి రోజు నాలుగు గంటల పాటు అతడికి పాఠాలు నేర్పించేది. ఈ క్రమంలో గత నెల 29న అతడు తమ ఇంటికి సమీపంలోని దేస్రాజ్ కాలనీలో ఉంటున్న టీచర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి అయినా కూడా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కొడుకుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా సదరు టీచర్ ఇంటికి చేరుకుని కుమారుడి కోసం వాకబు చేశారు. కానీ తమ కూతురు కూడా కనిపించడం లేదంటూ టీచర్ కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. దీంతో ఆ టీచర్‌పై మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ టీచర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీస్ అధికారి రాణా ప్రతాప్ తెలిపారు. ఆ టీచర్‌కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలిసింది. ఇక వారిద్దరు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు పేర్కొన్నారు.. చదవండి: కలెక్టర్ ఎమోషనల్: ఇంటి బిడ్డగా చూసుకున్నారు -
ఆయుధాలను పట్టుకొని.. ఆమెను రోడ్డుపై పడేసి
అలప్పుజ: గల్ఫ్ నుంచి నాలుగు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి, బంగారం కోసం బెదిరించి అనంతరం రోడ్డుపక్కనే పడేసిన ఘటన కేరళలోని పలక్కడ్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. అనంతరం ఆ మహిళ పోలీస్ స్టేషన్ చేరుకొని కేసు నమోదు చేయించారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గల్ఫ్‌లో సూపర్మార్కెట్లో పని చేసే బింధు నాలుగు రోజుల క్రితమే భారత్ లోని కేరళకు వచ్చారు. అనంతరం ఆమె వద్ద బంగారం ఉందో లేదో అడుగుతూ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు దాదాపు 15 మంది ఆయుధాలను పట్టుకొని తలుపు తట్టారని, అనంతరం బింధును బలవంతంగా తీసుకెళ్లా రని ఆమె భర్త బినోయ్ చెప్పారు. ఆమెను కారులో ఎక్కించుకున్నప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారంతా తన వద్ద ఉన్న బంగారం ఉందేమోనన్న దిశగా ప్రశ్నలు వేశా రని చెప్పారు. కాసేపటి తర్వాత దుండగులు ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లారు. బింధు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విషయం తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల గురించి అవసరమైన మేరకు వివరాలు లభించాయని, విచారణ చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: సెర్చ్ చేసి అనువైనవి గుర్తించి.. చదవండి: జాన్సన్ మీ వివరాలు పంపించాడంటూ.. రూ.48 లక్షలు -
మహిళ కిడ్నాప్: రూ. 4 లక్షల డిమాండ్
-
మహిళ కిడ్నాప్: రూ. 4 లక్షల డిమాండ్
హైదరాబాద్: అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమె ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. కిడ్నాపర్లు మహిళ భర్తకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపైన మహిళ వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.