మహిళా దొంగల హల్చల్
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో మహిళా దొంగలు హల్చల్ చేశారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లోని థియేటర్ సమీపంలో ఉన్న ఓ క్లీనిక్ పై దాడి చేసిన మహిళ దొంగలు పెద్ద ఎత్తున నగదు ఎత్తుకెళ్లారు. పెద్దనోట్లు రద్దవడంతో.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నదంపతులపై దాడి చేసిన దొంగలు, సొత్తు అపహరించుకెళ్లారు. దీంతో బాధితులు రాంగోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.