మహిళలకు ‘ప్రమాదకర’ నగరాలివే!
న్యూయార్క్: ప్రపంచం చర్చించుకుంటున్న తాజా అంశాల్లో ‘మహిళల భద్రత’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని మహిళా సంఘాలు గొంతుచించుకుంటున్నా.. లైంగిక వేధింపులు, మాటలు, చేతలతో చిత్రహింసలు, ఇతర సమస్యలు ఏమాత్రం తగ్గటం లేదు. మరీ ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివని.. థాంప్సన్ రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల రాజధానులతోపాటు ఇతర 16 ముఖ్య నగరాల్లో సర్వే నిర్వహించి.. మహిళలపాలిట అపాయకరంగా మారిన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. లండన్లో 18-34 ఏళ్ల మధ్య వయసున్న మహిళ్లలో 41 శాతం మంది భయంకరమైన లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడైంది.
తొలి 16 నగరాల జాబితా
బొగోటో (కొలంబియా), మెక్సికో సిటీ, లిమా (పెరూ), న్యూఢిల్లీ, జకార్తా, బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా), కౌలాలంపూర్, బ్యాంకాక్, మాస్కో, మనీలా, పారిస్, సియోల్, లండన్, బీజింగ్, టోక్యో, న్యూయార్క్.