The womens tournament
-
క్వార్టర్స్‌లో భువన
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో క్వాలిఫయర్ భువన 6–2, 6–3తో మూడో సీడ్, హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టిపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రాంజల 5–7, 6–7 (5/7)తో టాప్ సీడ్ ఫాత్మా అల్ నభాని (ఒమన్) చేతిలో... పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి రెడ్డి 1–6, 3–6తో మెహక్ జైన్ (భారత్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి చిలుముల–ప్రేరణ జంట 7–6 (7/4), 4–6, 10–6తో రష్మీ –ఇతీ మెహతా (భారత్) జోడీపై నెగ్గింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–2, 2–6, 7–5తో భారత్‌కే చెందిన నందిని శర్మపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి నిధి చిలుముల 6–4, 2–6, 4–6తో లులు రాడోవిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు గువహటిలో జరుగుతున్న ఇండియా ఫ్యూచర్స్–3 టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రెండో రౌండ్లోకి చేరాడు. తొలి రౌండ్లో విష్ణు 6–3, 7–6 (7/3)తో జతిన్ దహియాపై గెలిచాడు. -
‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భారత్
సిలిగురి: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్ఏఎఫ్ఎఫ్) మహిళల టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కంచన్‌జంగ స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో నేపాల్‌ను కంగుతినిపించింది. కమలా దేవి (45వ నిమిషంలో) చేసిన గోల్‌తో భారత్ తొలి అర్ధభాగంలో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ద్వితీయార్ధంలో భారత క్రీడాకారిణిలు మరింత రెచ్చిపోయారు. ఇందుమతి (58వ ని.లో), సస్మిత మలిక్ (83వ ని.లో) చెరో గోల్ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. నేపాల్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సబిత్రా భండారి (75వ ని.లో) సాధించింది. ఈనెల 4న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ 6–0తో మాల్దీవులుపై గెలిచింది.