సిలిగురి: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్‌ఏఎఫ్‌ఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కంచన్‌జంగ స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో నేపాల్‌ను కంగుతినిపించింది. కమలా దేవి (45వ నిమిషంలో) చేసిన గోల్‌తో భారత్ తొలి అర్ధభాగంలో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం ద్వితీయార్ధంలో భారత క్రీడాకారిణిలు మరింత రెచ్చిపోయారు. ఇందుమతి (58వ ని.లో), సస్మిత మలిక్ (83వ ని.లో) చెరో గోల్ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. నేపాల్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సబిత్రా భండారి (75వ ని.లో) సాధించింది. ఈనెల 4న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ 6–0తో మాల్దీవులుపై గెలిచింది.
‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భారత్
Published Tue, Jan 3 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement