పాకిస్తాన్‌పై 5–2 గోల్స్‌తో విజయం
కట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్ భారీ విజయంతో శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం ఇక్కడి దశరథ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5–2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. సగం మ్యాచ్ ముగిసేసరికే దాయాది జట్టుపై 4–1తో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచింది.
తద్వారా కెప్టెన్ ఆశాలతా దేవి అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. భారత్ తరఫున గ్రేస్ డాంగ్మెయి (5వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మనీషా (17వ ని.లో), బాలాదేవి (35వ ని.లో), జ్యోతి చౌహాన్ (78వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
ఈ మ్యాచ్ ద్వారా బాలాదేవి 50 గోల్స్ మైలురాయిని అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా ఆమె గుర్తింపు పొందింది. పాక్ తరఫున సుహ హిరాణి (45+2వ ని.లో), మేరీ సిద్దిఖీ (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment