చిరుద్యోగుల భవిష్యత్తుపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై రాష్ట్రంలోని సుమారు 3.84 లక్షల మంది చిరుద్యోగుల భవిష్యత్ ఆధారపడి ఉంది. విభజన పంపకాల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు, హోంగార్డులు, ఎన్ఎంఆర్లను మినహాయింపు ఇచ్చారు. రెగ్యులర్ పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ.. ఆ పోస్టులను ఖాళీగానే చూపించనున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, హోంగార్డులు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 3.84 లక్షల మంది పనిచేస్తున్నారు.
వారి పదవీ కాలాన్ని మే నెలాఖరుకే ముగియనున్నా.. రెండు రాష్ట్రాలు విడిపోతున్నందున వారి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించారు. కానీ, వీరి భవిష్యత్ కొత్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.hh జూన్ 2న రాష్ట్రం విడిపోరుు రెండు ప్రభుత్వాలు ఏర్పడనుండగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాయూ లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.