వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోభారత లాంగ్ జంపర్‌కు నిరాశ
Sreeshankar: అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకున్న భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అతను కేవలం 7.96 మీటర్లు మాత్రమే జంప్ చేసి ఉసూరుమనిపించాడు. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని పతకం లేకుండానే టోర్నీ నుంచి వైదొలిగాడు.
శ్రీశంకర్ ప్రస్తుత ప్రదర్శన ఈ ఏడాది ఫెడరేషన్ కప్ ప్రదర్శనతో (8.36 మీటర్లు) పోలిస్తే చాలా తక్కువ. మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో భారత ఆటగాడు ఎం.పి. జబిర్ 50.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఏడో స్థానంలో నిలిచాడు. ఫలితంగా అతను ఫైనల్‌కు కూడా చేరుకుండానే నిష్క్రమించాడు.
చదవండి: World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు!