నగరంలో వాకథాన్
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలో గురువారం వాకథాన్ ని ర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ కా ర్యక్రమం కొనసాగింది. బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత అం దరిపై ఉందని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
వరంగల్ క్రైం : బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ‘వాకథాన్’ కార్యక్రమం జరిగింది. హన్మకొండలోని జిల్లా పోలీసు కా ర్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ వాకథాన్ నిర్వహించారు. బాలల సమస్యలు, వారి హక్కులను పరిరక్షించడం, చైల్డ్‌లైన్ 1098 సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ వాకథాన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపా రు.
కార్యక్రమ ప్రారంభంలో ఏజేసీ కృష్ణారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాలు విద్యార్థులు, పో లీసు సిబ్బందితో బాలల హక్కుల రక్షణకు పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేయించి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ మేరకు ఎస్పీ మా ట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఏజేసీ కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ తమ కమిటీ బాలల రక్షణకు కవచంగా పనిచేస్తోందని తెలి పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమేష్, ఆర్ఐ ప్రతాప్, శ్రీనివాస్, సదానందం, పోలీ సు సంక్షే మ అధికారి శ్రీనివాస్, పోలీసు అధికారుల అధ్యక్షుడు అశోక్‌కుమార్, చైల్డ్‌లైన్ నోడల్ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, కృష్ణమూర్తి, విద్యార్థులు, సభ్యులు పాల్గొన్నారు.