world cup -2015
-
ICC World Cup: గెలిచిన జట్టులో సభ్యుడు.. ఇప్పుడు కార్పెంటర్!
ఆస్ట్రేలియా(కాన్బెర్రా): భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ కారణంగా కొత్తగా ఎంతో మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. వారికి వేలంలో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతిభ నిరూపించుకంటే కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాళ్లు కూడా కొంతమంది ఈ లీగ్‌లో ఆడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పొట్ట పోషించుకోవడానికి వడ్రంగిగా మారిపోయాడు. జేవియర్ డోహెర్టీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు పైగా అవుతోంది. 2015 ప్రపంచ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టులో అతడు భాగస్వామిగా ఉన్నాడు. లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జేవియర్ డోహెర్టీ 2001-02 సీజన్లో తన ఫస్ట్-క్లాస్ జట్టులో అరంగేట్రం చేశాడు. దాదాపు అతను 17 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగారు. 71 ఫస్ట్ క్లాస్, 176 లిస్ట్ ఏ, 74 టీ-20 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తం 415 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడు చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కనిపించాడు. ఈ మాజీ ఆస్ట్రేలియన్ లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటిరకు ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు ఆడాడు. కాగా 2020, మార్చిలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ కోసం చివరిసారిగా ఆడాడు. Test bowler turned carpenter 👷🔨 Xavier Doherty took some time to find what was right for him following his retirement from cricket, but he's now building his future with an apprenticeship in carpentry.#NationalCareersWeek pic.twitter.com/iYRq2m39jt — Australian Cricketers' Association (@ACA_Players) May 18, 2021 (చదవండి: Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం) -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
హామిల్టన్: ప్రపంచకప్‌లో భాగంగా గ్రూపు - బిలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐర్లాండ్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌లో మూడు గెలిచి.. ఆరు పాయింట్లతో ఉండగా.... టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్‌లు నెగ్గి గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది. -
నేపియర్ (మెక్లీన్ పార్క్)
నాలుగు ప్రధాన స్టాండ్స్, ఒక వైపు పచ్చని గడ్డితో కూడిన స్టాండ్ మెక్లీన్ పార్క్‌కు ప్రధాన ఆకర్షణ. ఇందులో సీట్లు ఉండవు. కింద కూర్చొని మ్యాచ్‌లను తిలకిస్తారు. భారీ విస్తీర్ణంలో ఉండే ఈ మైదానంలో ఇండోర్ స్టేడియం, రోడ్నీ గ్రీన్ కాంటినెంటల్ ఈవెంట్ సెంటర్, నాలుగు కార్పొరేట్ లాంజ్‌లు, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన 24 సూట్స్ ఉన్నాయి. ఎక్కువగా క్రికెట్, ఆ తర్వాత రగ్బీ మ్యాచ్‌లు జరుగుతాయి. అప్పుడప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. స్టేడియం కెపాసిటీ 20 వేలు. హాక్స్ బే ప్రాంతంలో ఉన్న నేపియర్ మధ్యదరా వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. దీన్ని కివీస్ ‘ఫుడ్ బౌల్’ అంటారు. ప్రపంచ స్థాయి వైనరీలు, వ్యవసాయ మార్కెట్లు, శిల్పాలు చెక్కినట్లుగా ఉండే వసతి సముదాయాలు ఈ నగరానికి పేరు తెస్తున్నాయి. 1931లో ఘోరమైన భూ కంపం తర్వాత నేపియర్‌ను పునర్ నిర్మించారు. కేప్ కల్చర్, నైట్ లైఫ్, షాపింగ్‌లకు ప్రసిద్ధి.