ఆటో శక్తి సభ
నేడు ఏనుగులగడ్డలో ఆటో డ్రైవర్ల మహాసభ
{పత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయూలని డిమాండ్
ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమం
జిల్లాలో 60 వేల ఆటోవాలాలు హాజరుకానున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆటోడ్రైవర్లు తమ సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ గళం విప్పుతున్నారు. ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలాదిమంది ఆటోడ్రైవర్లతో ఆగస్టు ఒకటిన వరంగల్ నగరంలో తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఆటోడ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి పరిష్కార మార్గాలపై సభలో చర్చించనున్నారు.
వేలాది మందికి ఉపాధి
ఇంతకాలం అసంఘటిత రంగంలో కార్మికులుగా అటోడ్రైవర్లు కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానంలో తొలిసారిగా ఆటోడ్రైవర్లు సంఘటిత శక్తిగా మారారు. 2011లో జరిగిన సకల జనుల సమ్మెలో వేలాది మంది ఆటోడ్రైవర్లు మహార్యాలీ నిర్వహించి సమ్మె సైరన్ మోగించారు. ఉద్యమం జరిగిన రోజుల్లో ఆటోడ్రైవర్లు చేసిన త్యాగాలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా పన్ను నుంచి మినహాయింపునిచ్చి ఆదుకున్నారు. పట్నం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల వేలాది మంది యువకులు ఆటోడ్రైవర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఈ వృత్తిని నమ్ముకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఆటోలపై ఆధారపడిన కుటుంబాలు 60 వేలకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం వీరంతా గళం విప్పుతున్నారు. అందులో భాగంగానే శనివారం ఉదయం11.30 గంటలకు హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (ఏనుగులగడ్డ) వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు సభకు హాజరుకానున్నారు.
విజయవంతం చేయూలి...
ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించనున్న ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ఆటోడైవర్స్ యూనియన్(టాడు) గౌరవ అధ్యక్షుడు గుడిమ ళ్ల రవికుమార్ శుక్రవారం వరంగల్ నగరంలో ప్రచారం నిర్వహించారు. ఆటోరంగం నడుస్తున్న పరిశ్రమ అని అన్నారు. అదాలత్ సెంటర్ నుం చి స్వయంగా ఆటోనడుపుతూ జులైవాడ, రెవిన్యూకాలనీ, వడ్డేపల్లిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు డీజి ల్ అమ్మకం ద్వారా ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోందని.. అదేస్థాయిలో ప్రభుత్వం నుంచి ఆటోడ్రైవర్లకు సాయం అందడం లేదన్నారు. యూనియన్ ప్రథమ మ హాసభ ద్వారా ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు