11న వరల్డ్ డైమండ్ సదస్సు
హైదరాబాద్: అంతర్జాతీయ వజ్రాల వ్యాపార దిగ్గజాలతో ఈ నెల 11, 12న న్యూఢిల్లీలో వరల్డ్ డైమండ్ కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీని ప్రారంభ కార్యక్రమంలో పొల్గొంటారని జెమ్ అండ్ జ్యుయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజే ఈపీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
వజ్రాల మైనింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వివరించింది. కేంద్ర వాణిజ్య శాఖ తోడ్పాటుతో వరల్డ్ డైమండ్ మార్క్ ఫౌండేషన్, జీజేఈపీసీ ఈ సదస్సును నిర్విహ ంచనున్నాయి.