ప్రపంచ సెయిలింగ్ టోర్నీకి దుర్గా ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన యువ సెయిలర్ దుర్గాప్రసాద్ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. పట్టాయాలో జరిగే ప్రపంచ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో దుర్గా ప్రసాద్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. పట్టాయాలోని రాయల్ వరుణ యాట్ క్లబ్లో జరిగే ఈ టోర్నమెంట్లో 62 దేశాలకు చెందిన 280 మంది సెయిలర్లు పాల్గొంటున్నారు.
ఇందులో అండర్–16 ఆప్టిమిస్టిక్ క్లాస్ విభాగంలో దుర్గాప్రసాద్ తలపడనున్నాడు. తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా హైదరాబాద్ యాట్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న శిక్షణా శిబిరంలో దుర్గాప్రసాద్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు.