తేజస్వినికి స్వర్ణం
అండర్-15 ప్రపంచ స్కూల్ చెస్
పట్టాయ : ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ అండర్-15 బాలికల విభాగంలో భారత క్రీడాకారిణి తేజస్విని సాగర్ స్వర్ణం సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఈ ఔరంగాబాద్ అమ్మాయి ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అండర్-15 బాలుర విభాగంలో ఆనంద్ నాడార్, అండర్-17 బాలికల విభాగంలో సలోని రజతాలు సాధించారు.