తెలంగాణ వంటలకు ప్రపంచస్థాయి గుర్తింపు
జిల్లా వనరుల కేంద్రం చైర్మన్ డాక్టర్ యాదగిరి
ఆకట్టుకున్న జిల్లా స్థాయి తెలంగాణ వంటల పోటీ
బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన ప్రాంత వంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని జిల్లా వనరుల కేంద్రం చైర్మన్ డాక్టర్ యాదగిరి అన్నారు. పాలెం శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం జిల్లాస్థాయి లో తెలంగాణ వంటకాల పోటీలను నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. మనం మన గురించి కాకుండా సమాజ హితం కోసం పాటు పడాలన్నారు. గతంలో తెలంగాణ వంటలకు గుర్తింపు ఉండేది కాదని, నేడు జాతీయ స్థాయిలో తెలంగాణ వంటకం గట్కాకు గుర్తింపు రావడం అందుకు ఉదాహరణ చెప్పుకొచ్చారు. పాలమూరు విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో హోటల్ మేనేజ్మెంట్ విద్యకు ఎంతో ఆదరణ పెరిగిందని, విద్యార్థులు ఆ రంగాన్ని ఎంచుకొని ఉన్నతంగా రాణిస్తున్నారని అన్నారు.
ఆకట్టుకున్న తెలంగాణ వంటలు
జిల్లాస్థాయిలో నిర్వహించిన తెలంగాణ వం టలు కళాశాలలో తోటి విద్యార్థులను ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినీలు పోటీల్లో తమ ప్రతిభను కనబర్చారు. నాగర్‌కర్నూల్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు కుర్బానికా మీట తయారు చేసి కృష్ణవేణి, స్రవంతిలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులు బీట్రూట్ రైస్ వండి మానస, సీత, సింధూలు ద్వితీయ బహుమతి, ప్రూట్స్ సలాడ్ తయారు చేసి ఓరియంటల్ కళాశాల విద్యార్థులు హరిణి, శ్రీదేవిలు తృతీయ బహుమతి పొందారు. విద్యార్థులను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్‌సింగ్ అభినందించారు. కార్యక్రమంలోడి.కె.వసంతారెడ్డి,కృష్ణ, నాగరా జు, రాధాకుమారి, పద్మజారాణి పాల్గొన్నారు.