రూ.లక్ష విలువైన గుట్కా స్వాధీనం
రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కొత్తపల్లి ప్రాంతంలో మహ్మద్పాషా అనే వ్యక్తి గుట్కా హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన గుట్కాను బెంగళూరు నుంచి తెస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అర్బన్ సీఐ శ్యామారావు ఆధ్వర్యంలో పోలీసులు గోదాముపై దాడి చేసి రూ.లక్ష విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్పాషాను అదుపులోకి తీసుకున్నారు.