తృటిలో తప్పిన ప్రాణాపాయం
పెనుగొండ: పెనుగొండ కళాశాలల బస్‌షెల్టర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే కళాశాలల కూడలి వద్ద మంగళవారం మితిమీరిన వేగంతో వాహనాలు వచ్చి ఎదురెదురుగా ఢీకొని బస్‌షెల్టర్‌లోకి దూసుకువెళ్లాయి. బక్రీద్ సెలవు కావడంతో విద్యార్థులు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. రోడ్డు ఒకSవైపునే బాగుండటంతో ట్రాక్టర్, ఆటో వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో బోల్తా పడగా ట్రాక్టర్ షెల్టర్‌లోకి దూసుకుపోయింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.