మహిళల విభాగం చాంపియన్ వరంగల్
దుగ్గొండి : మండల కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న 34వ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడలు శనివారం ము గిశాయి. మహిళల విభాగంలో జిల్లా జట్టు చాంపియన్, సబ్ జూనియర్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో పైల్వాన్ ఫైటింగ్‌ను ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రెజ్లింగ్‌లో మహిళలు పాల్గొనడం అభినందనీయమన్నా రు. వీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని ఆకాంక్షిం చారు. రెజ్లింగ్ అభివృద్ధికి పోలీస్ శాఖ పక్షాన సహకరి స్తామని చెప్పారు. నర్సంపేట ఎస్డీపీఓ మురళీధర్, సీఐ కిషన్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎన్నారైలు గంప వేణుగోపాల్, శానబోయిన రాజ్‌కుమార్, అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రకుమార్, యాదగిరి సుధాకర్, కె.రాజు, రాజిలింగం, సర్పంచ్ ఆరెల్లి సువర్ణరాణి, వైస్ ఎంపీపీ ఊరటి మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ బొటికె అనసూర్య, కోచ్‌లు అశోక్, గోకుల్, నారాయణ పాల్గొన్నారు.
వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి చాంపియన్లు..
రెజ్లింగ్ పోటీల్లో వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు వేర్వేరు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించి చాంపియన్ షిప్ దక్కించుకున్నారుు. జూనియర్ విభాగంలో 54 పాయింట్లతో రంగారెడ్డిచాంపియన్గా నిలిచింది. 50 పాయింట్లు సాధించి హైదరాబాద్ రన్నర్‌గా నిలిచింది. సబ్ జూనియర్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు 73 పాయింట్లతో చాంపియన్‌గా నిలువగా వరంగల్ క్రీడాకారులు 62 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు. మహిళా విభాగంలో 36 పాయింట్లతో వరంగల్ జిల్లా చాంపియన్‌గా నిలవగా 30 పాయింట్లుతో కరీంనగర్ రన్నరప్‌గా నిలిచింది. క్రీడాకారులకు రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ పక్షాన పతకాలు, జ్ఞాపికలు అందించారు.
మన జిల్లాకు చెందిన మహిళా రెజ్లర్లు 3 బంగారు, 4 కాంస్య పతకాలు సాధించారు. 43 కేజీల విభాగంలో పి. మానస, 65 కేజీల విభాగంలో ఆర్ . కీర్తన, 70 కేజీల విభాగంలో పి. శ్రీవేణి బంగారు పతకాలు సాధించారు. 56 కేజీల విభాగంలో జి. సుప్రియ, 43 కేజీల విభాగంలో ఎన్. వందన, 46 కేజీల విభాగంలో కే. రేష్మ, 52 కేజీల విభాగంలో జె. భవాని కాంస్య పతకాలు సాధించారు. అలాగే సబ్ జూనియర్ 76 కేజీల విభాగంలో కె. అనిరుద్ద్, 85కేజీల విభాగంలో బి,భరత్ బంగారు పతకాలు సాధించగా 100 కేజీల విభాగంలో కె. సృజన్‌కుమార్, 42 కేజీల విభాగంలో కే. విజేందర్, 50 కేజీల విభాగంలో వి.ఉదయ్‌సింగ్, 69 కేజీల విభాగంలో ఆర్. వెంకటేష్ కాంస్య పతకాలు సాధించారు.