ఫేస్బుక్ మరో సంచలనం
సోషల్ మీడియా మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న ఫేస్బుక్ త్వరలో మరో సంచలనం సృష్టించబోతోంది. 2019లో సిటిఆర్ఎల్-ల్యాబ్స్ స్టార్టప్ కంపెనీని ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పనిచేసే రిస్ట్‌బ్యాండ్ ఏ విధంగా పనిచేసేతుందో ఒక వీడియో రూపంలో వివరించింది. మానవ సూక్ష్మ నాడీ సంకేతాలతో ఎలక్ట్రోమియోగ్రఫీని ఉపయోగించే పనిచేసే రిస్ట్బ్యాండ్లను ఈ వీడియోలో చూపించింది. వర్చువల్ రూపంలో వస్తువులను జరపడం, ఎత్తడం, మెసేజ్ టైప్ చేయడం, స్వైప్ చేయడం, ఆటలు ఆడటం లేదా ఆర్చరీ సిమ్యులేటర్ వంటివి ఫేసుబుక్ త్వరలో తీసుకురాబోయే రిస్ట్‌బ్యాండ్ ద్వారా చేయవచ్చు.
ఫేస్బుక్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఫిజికల్ కీబోర్డులు కంటే ఎక్కువ వేగంతో ల్యాప్ లేదా టేబుల్ టాప్‌పై వర్చువల్ కీబోర్డ్‌ను ఉపయోగించి టైప్ చేయడానికి ఈ కొత్తరకం టెక్నాలజీ సహాయపడనున్నది. వీటన్నింటినీ నియంత్రించే రిస్ట్బ్యాండ్లు కూడా హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఇప్పుడు ఉన్న సాధారణ స్మార్ట్ వాచ్ కంటే పది రేట్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఫేసుబుక్ పేర్కొంది. ఫేసుబుక్ రిస్ట్‌బ్యాండ్‌ల చేతికి పెట్టుకున్న తర్వాత బొటనవేలు, చూపుడు వేలిని కలిపి కీబోర్డులను, ఇతర వస్తువులను ఆపరేట్ చేయవచ్చు. రిస్ట్‌బ్యాండ్ విజువల్ సెన్సార్‌కు బదులుగా మీ చేతుల నరాల సంకేతాలను ట్రాక్ చేస్తుంది. 2020లో జరిగిన ఫేస్బుక్ కనెక్ట్ సమావేశం సందర్భంగా కొత్తగా రాబోయే ఏఆర్ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ రెండు కూడా న్యూరల్, ఏఐ, ఏఆర్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయనున్నాయి.
చదవండి:
ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు