సమాజ మార్పుకు సాహిత్యం దోహదం
యానాం టౌన్ :
సమాజంలో మార్పుకు సాహిత్యం దోహద పడుతుందని పుదుచ్చేరి రాష్ట్ర కళలు, సాంస్కృతిక శాఖ, ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. స్థానిక సర్వశిక్ష అభియా¯ŒS సమావేశ మందిరంలో సాహిత్య అకాడమీ, స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్తంగా శనివారం నిర్వహించిన తెలుగు రచయితల సమావేశంలో ఆయన ముఖ్యఅతి«థిగా మాట్లాడారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయగలరన్నారు. యువత సాహిత్యంపై ఆసక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, సాహితీవేత్తలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. పుదుచ్చేరిలో కళలు, సాంస్కృతిక శాఖ ద్వారా అందించే తెలుగురత్న, కళైమామిణి అవార్డులను ఇప్పటి వరకూ దరఖాస్తు వారికి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఇకపై వివిధ రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులను ప్రభుత్వమే గుర్తించి వారికి ఆ అవార్డులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు, ప్రముఖ కవి డాక్టర్ ఎ¯ŒS.గోపి మాట్లాడుతూ విద్యార్థులు సాహిత్యాన్ని చదవాలని కోరారు. సాహిత్య అకాడమీ బెంగళూరు రీజినల్ కార్యదర్శి ఎస్.పి.మహాలింగేశ్వర్ మాట్లాడుతూ 1954లో సాహిత్య అకాడమీని స్థాపించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటా 300 వరకూ సాహితీ కార్యక్రమాలు, 30 నుంచి 40 సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. 30 భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కొత్తగా 50 భాషలను గుర్తించామని చెప్పారు. స్థానిక స్ఫూర్తి సాహితీ సమాఖ్య అధ్యక్షుడు, కవి దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ యానాంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డాక్టర్ ఎ¯ŒS.గోపి ఎంతో సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు డాక్టర్ శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మిదేవి, విమర్శకులు ఎం.నారాయణశర్మ, స్థానిక విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్, వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.