అందుకే ఆ బహుమతి!
శ్రుతీహాసన్కి ఇటీవల మంచి పుట్టినరోజు బహుమతి లభించింది. అది ఇచ్చింది వాళ్ల నాన్న కమలహాసనే. శ్రుతీ మంచి రచయిత్రి. నటనలో బిజీ అయిపోవడంతో ఆమెలోని రచయిత్రి మరుగునపడిపోయింది. దాంతో కమల్ మళ్లీ కూతురితో కలం పట్టించాలనుకున్నారు. అందుకే శ్రుతీకి ఊహించని బహుమతి ఇచ్చారాయన. దాని గురించి శ్రుతీహసన్ మాట్లాడుతూ -‘‘మా నాన్నగారు నాకిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఓ స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్, రైటింగ్ కోర్స్.
నా ప్రతిభ మీద ఆయనకు చాలా నమ్మకం. నా చిన్నప్పుడు నేను చిన్న చిన్న కథలు, కవితలు రాసేదాన్ని. ఇప్పుడు తీరిక చిక్కడంలేదు. నన్ను ఇన్స్పైర్ చేసి, మళ్లీ నాతో రచనలు చేయించడానికే నాన్నగారు ఆ బహుమతి ఇచ్చారు. నాక్కూడా రాయడం ఇష్టం. అందుకే వీలు చేసుకుని తొలుత లఘుచిత్రాలకు కథలు రాయాలనుకుంటున్నా’’ అన్నారు.