గోడకూలి మహిళ మృతి
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాత గోడ కూలి ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరగట్లు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన యమునాబాయి (50) ఇంటి ముందు ఉన్న పాత గోడ దగ్గర కూర్చోని ఉంది. అయితే, అదే సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద ఉన్న మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రెంజల్)