చైనా ఎన్ఎస్ఏతో దోవల్ చర్చలు
బీజింగ్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారు యాంగ్ జియేచీ గురువారం ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించారని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
డోక్లామ్‌పై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదే. డోక్లామ్ను నేరుగా ప్రస్తావించకుండా...ద్వైపాక్షిక సమస్యలపై చైనా ధోరణిని దోవల్‌కు యాంగ్ వివరించారని చైనా విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తావనకు వచ్చినట్లు చైనా మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది