Yara
-
బ్రెజిల్లో కొత్త వైరస్ ‘యారా’
బ్రెసిలియ : బ్రెజిల్‌లోని ఓ కత్రిమ సరస్సులో సరికొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి బ్రెజిల్ పురాణంలో ఉన్న మత్యకన్య ‘యారా’ పేరు పెట్టారు. ఇప్పటి వరకు కనుగొన్న వైరస్‌లకు ఈ వైరస్‌కు ఎలాంటి పోలిక లేకపోవడమే కాకుండా పూర్తి భిన్నంగా ఉండడం పట్ల శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్స్ ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మినా జెరాయిస్ నాయకత్వంలోని పరిశోధన బందం యారావైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించింది.ఈ వైరస్‌లో మొత్తం 74 జన్యువులు ఉండగా, అందులో 68 జన్యువులను తాము ఇంతవరకు ఏ వైరస్‌లో చూడలేదని, అందుకని వాటికి అనాథ జన్యువులుగా వ్యవహరిస్తున్నామని జెరాయిస్ తెలిపారు. గ్లోబల్ సైంటిఫిక్ డేటాలోని 8,500 రకాల జన్యువులతో పోల్చి చూసినా ఎక్కడా పోలిక దొరకలేదని ఆయన చెప్పారు. నేడు కరోనావైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్ వెలుగులోకి రావడం విశేషమే. బ్రెజిల్‌లోని బెలో హారిజాంటే నగరంలోని ఓ కత్రిమ సరస్సు నీటిలోని ఏకకణ జీవి అమీబాలో దీన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఏక కణ జీవి అమీబాల్లోనే ఈ వైరస్ కనిపిస్తున్నందున,మనుషులకు సోకే ప్రమాదం లేకపోవచ్చని జెరాయిస్ అభిప్రాయపడ్డారు.ప్రపంచంలోని సముద్రాల్లో గతంలో 15,222 రకాల వైరస్‌లను కనుగొనగా గత 2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల కాలంలోనే దాదాపు 1,80,000 రకాల వైరస్‌లను కనుగొన్నారు. వాటితో నీటిలో నివసించే వైరస్లు 1,95,728కు చేరుకున్నాయి. బహూశ సముద్ర జలాలు కలుషితం అవుతుండడం వల్ల వైరస్లు పెరిగి ఉండొచ్చేమో! -
ఊ కొట్టారా? ఊహూ అన్నారా?
ఆల్మోస్ట్ తొమిదేళ్ల క్రితం ‘లక్’ సినిమాతో బీటౌన్‌లో కథానాయికగా అడుగుపెట్టారు శ్రుతీహాసన్. ఆ తర్వాత అరడజనుకు పైగా హిందీ సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అందులో భాగంగానే బాలీవుడ్లో ఆమె మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారని టాక్. యాక్షన్ స్టార్ విద్యుత్ జమాల్ హీరోగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్‌ను సంప్రదించారట చిత్రబృందం. స్క్రిప్ట్ విని ఎగై్జట్ అయ్యారట శ్రుతి. ఇక అధికారికంగా ఎనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... ఆల్రెడీ ‘యారా’ అనే చిత్రంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించారు. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా రషెస్ చూసి విద్యుత్‌తో శ్రుతీ కెమిస్ట్రీ బాగుందని టీమ్ మెంబర్స్ కూడా భావించారని బీటౌన్ టాక్.ఒకవేళ ఈ సినిమాకు ఓకే చెబితే ఫారిన్ రిటర్న్ అమ్మాయి పాత్రలో నటించనున్నారట శ్రుతి. మరి.. ప్రచారంలో ఉన్నట్లు శ్రుతి ఈ ప్రాజెక్ట్‌కి ఊ కొట్టారా? ఊహూ అన్నారా? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ. బాలీవుడ్లో శ్రుతీ నటించిన చివరి చిత్రం ‘బెహన్ హోగి తేరి’. ఈ చిత్రం గతేడాది రిలీజైన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే.. తెలుగులో ‘కాటమరాయుడు’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ 12 నెలల్లో శ్రుతి తమిళ చిత్రాలకు కూడా ‘ఊ’ కొట్టలేదు. మంచి కథ, పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. లేకపోతే ‘ఊహూ’ అన్నదే ఈ బ్యూటీ సమాధానం అని పరిశీలకులు అంటున్నారు. -
ఈసారి మరో ఆగంతకుడు!
వరుస విజయాలతో దూసుకుపోతున్నా... శ్రుతిహాసన్‌కి మాత్రం ఒడుదొడుకులు తప్పడం లేదు. ఏదో ఒక రూపంలో ఈ ముద్దుగుమ్మకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఓ ఆగంతకుడు ముంబాయ్‌లోని ఆమె ఇంట్లోకి చొరబడి నానా హంగామా సృష్టించాడు. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. అలాగే ఆమధ్య... తన ప్రమేయం లేకుండానే శ్రుతి హాట్ స్టిల్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేసి, అన్ని చానల్స్‌లో హడావిడి చేశాయి. ఈ విషయమై శ్రుతి పోలీసుల దాకా వెళ్లారు. రీసెంట్గా మరో కొత్త ఇబ్బంది శ్రుతీని వెంటాడింది. వివరాల్లోకెళ్తే -ప్రస్తుతం శ్రుతీహాసన్ బాలీవుడ్లో ‘యారా’ అనే సినిమాలో నటిస్తున్నారు. తిగ్మన్షు ధూలియా దర్శకుడు. ఇర్ఫాన్‌ఖాన్ కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరి పరిసరాల్లో జరుగుతోంది. అక్కడే ఓ హోటల్లో శ్రుతి బస చేశారు. టైమ్ అర్థరాత్రి దాటింది. ఇంతలో తలుపు దబా దబా మోత. ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. శ్రుతికి గుండె ఆగినంత పనైంది. గతంలో జరిగిన చేదు అనుభవం మరిచిపోక ముందే మరో దుశ్చర్య. వెంటనే శ్రుతి తెలివిగా వ్యవహరించి, హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసింది. వెంటనే వారందరూ అప్రమత్తమై ఆ దుండగుణ్ణి పట్టుకున్నారు. పోలీస్ కేస్ కూడా నమోదు చేశారు. సిర్సా ప్రాంతానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఈ విధంగా తలుపును మోదాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. విషయం ఏంటంటే... ఆ వ్యాపార వేత్త శ్రుతి వీరాభిమానట. మద్యం మత్తులో అలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రుతికే ఇలాంటివి జరగడం నిజంగా బాధాకరమే.