Yash Puri
-
మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ ఎండింగ్’.. అడల్ట్ కంటెంట్ ఉండదు: యష్ పూరి
కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. హీరోగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటా. నా సినిమాలకు కథే మొదటి హీరో. నేను సెకండ్ హీరో. హ్యాపీ ఎండింగ్ మూవీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’అని అన్నారు యంగ్ హీరో యష్ పూరి. ‘చెప్పాలని ఉంది’, ‘అలాంటి సిత్రాలు’, ‘శాకుంతలం’ వంటి సినిమాలతో అలరించిన యష్ పూరి నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా యష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ "హ్యాపీ ఎండింగ్" కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ► ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్..ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ "హ్యాపీ ఎండింగ్" సినిమాలో చూస్తారు. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. ► మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా "హ్యాపీ ఎండింగ్". శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ► సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను హీరోగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో కథే.త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా. -
గూగుల్‌లో వెతికి సినిమాల్లోకి వచ్చా: యంగ్ హీరోయిన్
మా నేటివ్ ప్లేస్ ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా ఫ్యామిలీ గుజరాత్ షిప్ట్ అయ్యాం. నాన్న రిలయన్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేవారు. నా చైల్డ్ హుడ్ గుజరాత్ లో గడిచింది. అక్కడి నుంచి కొన్నాళ్లు కువైట్ వెళ్లాం. కువైట్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇండియాకు తిరిగి వచ్చాక గ్రాడ్యుయేషన్ చేసి కొంతకాలం జాబ్స్ చేశాను. జాబ్స్ ఏవీ నాకు సంతృప్తినివ్వలేదు. మన ఊహకు తగ్గట్లుగా పని చేస్తూ డబ్బులు సంపాదించడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేశా. యాక్టింగ్ అయితే మన ఊహ ప్రపంచానికి తగ్గట్లుగా పని చేయొచ్చని అనిపించి యాక్టింగ్ వైపు వచ్చాను’ అని యంగ్ హీరోయిన్ అపూర్వ రావు అన్నారు. యష్ పూరి, అపూర్వ రావు హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అపూర్వ రావు మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► సినిమాల మీద ఆసక్తి ఉన్నా మొదట్లో పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. కొన్నాళ్లకు యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకుని హైదారాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ లో జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ టైమ్ లో పరిచయమైన కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్, వారి కామన్ ఫ్రెండ్స్ ద్వారా "హ్యాపీ ఎండింగ్" సినిమా ఆడిషన్స్ కు పిలిచారు. ► తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి, బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేది వాళ్ల రిక్వైర్ మెంట్. నేను తెలుగుమ్మాయినే, నేను చేసిన ఆడిషన్ వాళ్లకు నచ్చి ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు. దీని కంటే ముందు చాలా సినిమాలకు ఆడిషన్ చేశాను. వాళ్లకు నా పర్ ఫార్మెన్స్ నచ్చినా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆఫర్స్ రాలేదు ► "హ్యాపీ ఎండింగ్" సినిమాకు యూత్ పుల్ మూవీ అనే పేరు వచ్చింది. కానీ సినిమాలో చాలా హ్యూమర్, ఫన్ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు బాగా నవ్వుకుంటారు. మాకు ఆ విషయం తెలుసుకాబట్టి బయట సినిమా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉన్నా...టెన్షన్ పడటం లేదు. సినిమా చూసిన వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్ టైన్ అవుతారు. ► ఈ మూవీలో హీరోకు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాని వల్ల ఆయన చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు. ఈ కాన్ ఫ్లిక్ట్ ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అందుకు అతను చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉంటాయి. ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తాయి. ► యష్ గుడ్ కోస్టార్. రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అలాంటి యాక్టర్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉండేది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు శాపం ఉంటుంది. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడో వాళ్లకు ప్రాబ్లమ్ వస్తుంది. అలాంటి అబ్బాయిని అర్థం చేసుకుని, అతనికి సపోర్ట్ గా నిలిచే క్యారెక్టర్ నాది. ఇందులో యోగా ఇన్ స్ట్రక్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తా. యోగా టీచర్ అంటే వాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుంటారు. నా క్యారెక్టర్ ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ లా అనిపించింది. హీరోయిన్ గా ఫస్ట్ ఫిలింకే కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించడం హ్యాపీగా ఉంది. ► మన సినిమా సెన్సిబిలిటీస్ లోనే హీరోయిన్ గా నా ప్రత్యేకత చూపించాలని కోరుకుంటున్నా. హీరోయిన్స్ శ్రీలీలను చూస్తే తను కూడా మన ఫార్మేట్ మూవీస్ లోనే డ్యాన్సెస్, పర్ ఫార్మెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. అలాగే సమంత భిన్నమైన కాన్సెప్ట్స్ లు సెలెక్ట్ చేసుకుంటోంది. నేను కూడా అలా వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంది. సాయి పల్లవి కెరీర్ చూస్తుంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేందుకు కావాల్సిన మోటివేషన్ కలుగుతుంటుంది. అవకాశాలు వస్తే ఆమెలా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయొచ్చు అని ధైర్యం వస్తుంటుంది. నేను డ్యాన్సులు చేయగలను. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. సింగింగ్ లోనూ ప్రాక్టీస్ ఉంది. ► "హ్యాపీ ఎండింగ్" సినిమాకు పనిచేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లమే కాబట్టి చాలా అండర్ స్టాండింగ్ తో వర్క్ చేశాం. దర్శకుడు కౌశిక్ మా అందరి సజెషన్స్, ఆలోచనలు తీసుకునేవారు. అలా టీమ్ వర్క్ గా మూవీ చేశాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. మనం చేసిన క్యారెక్టర్స్ కు మన వాయిస్ ఉంటేనే బాగుంటుందని బిలీవ్ చేస్తాను. అయితే కొన్నిసార్లు చిన్మయి లాంటి వాళ్ల వాయిస్ ఆ క్యారెక్టర్స్ కు అసెట్ అవుతుంటాయి. ►నాకు అడివి శేష్, రానా, నవీన్ పోలిశెట్టి వంటి హీరోస్ తో నటించాలని ఉంది. వాళ్ల మూవీస్ లో ఔట్ పుట్ బాగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక మంచి మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. -
శాపానికి గురైతే...
యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ పతాకాలపై అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘నా నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి వస్తే నా పరువు తీస్తావా. ఇక నీకు మిగిలింది నిగ్రహమే’, ‘బాబా శాపం ఇచ్చాడా?’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు మూడో సినిమా. పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు కౌశిక్. ‘‘సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్. ‘‘ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్‌లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇది నా తొలి చిత్రం’’ అన్నారు అపూర్వ. ‘‘ఈ జనరేషన్లోని అబ్బాయి ఓ బాబా శాపానికి గురైతే అతని పరిస్థితి ఏంటి? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కెమెరామేన్ అశోక్. -
ఆకట్టుకుంటోన్న ‘హ్యాపీ ఎండింగ్ ’ఫస్ట్ లుక్ పోస్టర్
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ కూర్చుని ఉండగా.. వెనక గణపతి ఫోటో ఉంది. (చదవండి: అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్) ఒక మునీశ్వరుడుతో పాటు పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి ఫోటోస్ కనిపిస్తుండగా.. పోస్టర్ లో ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని రూపొందిన చిత్రం ఇది. -
'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ
టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ) నటీనటులు: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృథ్వీరాజ్, తనికెళ్ల భరణి, అలీ, రాజీవ్ కనకాల, మురళి శర్మ, రఘుబాబు, సునీల్ నిర్మాణ సంస్థలు: సూపర్ గుడ్ ఫిల్మ్స్, హ్యామ్స్టెక్ ఫిల్మ్స్ నిర్మాత: ఆర్బీ చౌదరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్ సంగీతం: అస్లాం కేయి విడుదల తేదీ: డిసెంబర్ 09, 2022 యశ్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించిన చిత్రం 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్ గుడ్ ఫిల్మ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అరుణ్ భారతి దర్శకత్వ వహించగా.. ఆర్బీ చౌదరి నిర్మించారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. ఈ సినిమాలో హీరో యశ్ పూరి(చందు) ఓ టీవీ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. మాతృభాష అంటే చిన్నప్పటి నుంచి హీరోకు విపరీతమైన అభిమానం. కుటుంబం కోసం రిపోర్టింగ్‌తో పాటు బైక్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అదే సమయంలో స్టెఫీ పటేల్(వెన్నెల) పరిచయమవుతుంది. హీరో ఆటిట్యూడ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు చందు బైక్‌పై వెళ్తుంటే యాక్సిడెంట్‌కు గురవుతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఈ కథలో హీరో తన ప్రేమను గెలిచారా? యాక్సిడెంట్ తర్వాత కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. మాతృభాష విషయంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే. ఎలా ఉందంటే... సినిమా ప్రారంభం నుంచి హీరో యశ్ పూరి(చందు) పనిచేసే టీవీ ఛానెల్ చుట్టే తిరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్లు పడే కష్టాలను సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీ, సత్య మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. రిపోర్టింగ్ చేస్తూనే ఇంటి నుంచి తప్పిపోయిన చిన్న పిల్లలను సేవ్ చేయడం, అదే సమయంలో హీరోకు స్టేఫీ పటేల్ (వెన్నెల)తో పరిచయం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని సత్యమూర్తి(మురళి శర్మ)ను చందు ఒప్పిస్తాడు. ఆ తర్వాత హీరోకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాతే జరిగే కథే సినిమాలో అసలైన ట్విస్ట్.ఆ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సెకండాఫ్‌లో కథ మొత్తం హీరో మాట్లాడే భాష చుట్టే తిరుగుతుంది. ఎవరికీ అర్థం కానీ భాషలో మాట్లాడే హీరోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అసలు అతను మాట్లాడేది భాషేనా? లేక మానసిక వ్యాధినా? అనే విషయం చుట్టే సెకండాఫ్‌లో హైలెట్. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు హీరోయిన్ వెన్నెల హిమాలయాలకు వెళ్లడం, రాజీవ్ కనకాల(డాక్టర్ కేశవ్), సత్య చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు అంతరించిన పోయిన భాష చుట్టే కథ మొత్తం నడిపించాడు. సినిమా మధ్యలో సునీల్ ఎంట్రీ, బాబాగా అలీ పాత్రలు అదనపు బలం. ఈ సినిమాలో ఒక్కమాటలో చెప్పాలంటే 'పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం' అనేలా ఉంది. తెలుగు భాషను కాపాడుకుందాం అనే సందేశాన్నిచ్చారు దర్శకుడు. ఎవరెలా చేశారంటే... రిపోర్టర్ పాత్రలో హీరో చందు ఆకట్టుకున్నాడు. అర్థం కానీ భాషను అవలీలగా మాట్లాడి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల పాత్రలో హీరోయిన్ స్టెఫీ పటేల్ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పృథ్వి, సత్య కామెడీ పాత్రలకు తగిన న్యాయం చేశారు. విలన్ పాత్రలో ఎమ్మెల్యే రామకృష్ణగా రఘు బాబు సత్యమూర్తిగా మురళి శర్మ, డాక్టర్ కేశవ్‌గా రాజీవ్ కనకాల, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి తమ నటనతో మెప్పించారు. అలీ, సునీల్ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేశారు. అస్లాం కేయి సంగీతం ఫరవాలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
క్రికెటర్ని కావాలనుకున్నాను కానీ..
‘‘చెప్పాలని ఉంది’ సినిమాలో కథే పెద్ద హీరో. కథ బావుంటే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మా ‘చెప్పాలని ఉంది’ మొదటి రెండు స్థానాల్లో ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు యష్ పూరి. అరుణ్ భారతి. ఎల్ దర్శకత్వంలో యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా యష్ పూరి మాట్లాడుతూ– ‘‘నేను క్రికెటర్ని కావాలని కల కన్నాను. హైదరాబాద్ రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్ వరకూ వెళ్లాను. అయితే కొన్ని కారణాల వల్ల క్రికెట్ వదిలి, సినిమాతో ప్రేమలో పడ్డా. ఓ రకంగా నాకు అల్లు అర్జున్‌గారే స్ఫూర్తి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘అలనాటి సిత్రాలు’లో నాకు తొలి చాన్స్ వచి్చంది. ఇప్పుడు సూపర్ గుడ్ ఫిలింస్‌లో ‘చెప్పాలని ఉంది’తో సోలో హీరోగా లాంచ్ కావడం నా లక్. ఇందులో జర్నలిస్ట్ చంద్ర శేఖర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా చేశాక మీడియా మీద మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు.