పోలీసుల అదుపులో కిడ్నాపర్లు....?
మన్సూరాబాద్: ఇంటి ముందు సైకిల్ తొక్కుతున్న బాలున్ని కిడ్నాప్ కేసులో కిడ్నాపర్లు ఎల్బీనగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.... ఎల్బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్ట్ హైవే కాలనీలో నివాసముండే ఆశిష్‌కుమార్ కుమార్ ఎల్బీనగర్లో మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కుమారుడు యశెష్ విజయ్‌పాత్ర (7) జాన్సన్ గ్రామర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు సైకిల్ తొక్కుతూ ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇండికా కారులో వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి అదే రాత్రి వనస్థలిపురంలో వదిలిపెట్టారు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు కిడ్నాపర్లలో మనోహర్, భానుప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి మీడియా ముందు కిడ్నాపర్లను ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.