అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి తూర్పుగేట్ వద్ద సాయిబాలాజీ లాడ్జిలో యశోద(35)అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తి రూరల్ మండలంలోని చిన్ననిడిమామిడప్ప కుమార్తె యశోదను 15 సంవత్సరాల క్రితం పుట్టపర్తికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశా రు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. యశోద అమడగూరు మండలం తంగేడుకుంట కు చెందిన రామాంజనేయులుతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న విషయం ఎనిమిది నెలల క్రి తం బయటపడడంతో భర్త ఆమెకు దురమయ్యా డు.
అప్పటి నుంచి ఆమె నిడిమామిడిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. శనివారం ప్రియుడు రామాంజనేయులుతో కలసి మధ్యాహ్నం 12 గం టల ప్రాంతంలో సాయిబాలాజీ లాడ్జిలోని గది అ ద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాం తంలో రామాంజనేయులు బయటికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5.30కు గదులు శుభ్రం చేసే సిబ్బంది అనుమానం వచ్చి కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూడగా యశోద ఫ్యా¯ŒSకు ఉరివేసుకుని ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులకు సమాచారం అందించారు. కే సు నమోదు చేసుకుని విచారణ చేపడతావ సీఐ తెలిపారు. ప్రియుడితో విబేధాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలనుందని సీఐ తెలిపారు.