గ్రహం.. అనుగ్రహం..
మనకు చందమామ కనిపిస్తుంది.. మరి మిగతా గ్రహాలు కనిపిస్తాయా? లేదు కదా.. చంద్రుడు భూమికి ఆ మాత్రం దగ్గరగా ఉంటాడు కాబట్టి.. మనకు కనిపిస్తున్నాడు. అదే విధంగా గ్రహాలు కూడా మన కి కనువిందు చేయడానికి భూమికి చంద్రుడెంత దగ్గరలో ఉంటాడో అక్కడికి వచ్చేస్తే.. అప్పుడవి మనకెలా కనిపిస్తాయి? ఇలాంటి ఆలోచనతోనే అమెరికాకు చెందిన యతి డైనమిక్స్ అనే సంస్థ ఓ చిన్న వీడియోను రూపొందించి.. యూట్యూబ్లో పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఇక ఫొటోలోనిది శని గ్రహం. అది భూమికి చంద్రుడంత దగ్గర్లోకి వచ్చేస్తే.. ఇంత సైజులో మనకు కనిపిస్తుందన్నమాట.