మభ్యపెట్టేందుకే ఉద్యోగ ప్రకటనలు
బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటికీ ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని, ఉద్యోగ ఖాళీలను మాత్రం భర్తీ చేయడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీలున్నాయని, ప్రభుత్వం మాత్రం ప్రకటనలతో కాలం వెళ్లదీస్తోందని అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.