చెలరే గిన యోగీందర్
జింఖానా, న్యూస్‌లైన్: యోగీందర్ (95 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లో సుల్తాన్ షాహీ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన సుల్తాన్ షాహీ జట్టు 386 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో రెండో రోజు బ్యాటింగ్ చేసిన టైటాన్స్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. యోగీందర్ రెండు, ప్రశాంత్ 5 వికెట్లు తీశారు.
మరో మ్యాచ్‌లో పాషా బీడీ జట్టుపై అవర్స్ సీసీ జట్టు నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాషా బీడీ జట్టు 104 పరుగుల వద్ద ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అవర్స్ సీసీ జట్టు 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి విజయం సాధించింది. బౌలర్ ముజ్తాబా 4 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. అలీ ఖాన్ (26 నాటౌట్), పుష్పీందర్ (29) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
బాలాజీ కోల్ట్స్: 294, పీ అండ్ టీ కాలనీ: 144 (సాయి సంతోష్ 37 నాటౌట్, మహేష్ రెడ్డి 45 నాటౌట్, నవజ్యోత్ సింగ్ 5/38)
జిందా సీసీ: 395, హెచ్‌బీసీసీ: 300/8 (రోహిత్ 33, అక్షయ్ 45, ఒమర్ 71, తౌసీఫ్ 68, శ్రవణ్ 3/62, ఫరాజ్ 3/94)
ఎ-డి విజన్ వన్డే లీగ్ స్కోర్లు
ఎస్యుసీసీ: 109 (సుధీర్ 4/24), యునెటైడ్ సీసీ: 78 (ఫిరోజ్ 3/10, హమీద్ 4/23).