జయ్‌తో చలో ఢిల్లీ
యువ నటుడు జయ్‌తో చలో ఢిల్లీ అంటోంది నటి ఆండ్రియా. ఈ ఇద్దరూ సంచలన తారలే. అంతేకాదు మోస్ట్ ఎలిజిబిటీ బ్యాచ్‌ల్లో లిస్టులో వీరిద్దరూ ఉన్నారన్నది గమనార్హం. అలాంటి ఈ జంట ఒక చిత్రంలో కలిసి నటిస్తే ఆ క్రేజే వేరు. సరిగ్గా అలాంటి చిత్రం త్వరలో తెరపైకి రానుంది. జయ్, ఆండ్రియాల కలయికలో వలియవన్ అనే చిత్రం, చిత్ర నిర్మాణం జరుపుకుంటోంది. ఎంగేయుం ఎప్పోదుం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శరవణన్ ఈ చిత్రానికి రూపకర్త.
విభిన్న యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను దేశ రాజధాని ఢిల్లీలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో జయ్, ఆండ్రియాలు త్వరలో ఢిల్లీకి పయనం కానున్నారన్నది తాజా వార్త. అక్కడ జయ్, ఆండ్రియలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. డీ.ఇమాన్ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌వర్గాల మాట.