ఘాట్‌రోడ్డులో ప్రమాదం ఇద్దరి దుర్మరణం
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్, మరొక యువకుడు మృతి చెందారు. తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం బాలాజీ(35), తిరుమలలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద వ్యాపారంచేసే కుమార్‌రెడ్డి(23) ఆదివారం తిరుపతిలో ఓ పార్టీకి హాజరయ్యారు. తిరిగి రాత్రి 8.30 గంటలకు ద్విచక్రవాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు.
మార్గమధ్యంలో అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ద్విచక్రవాహనం రోడ్డుపక్కనే ఉన్న నీటితొట్టెను ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీటీసీ అంబులెన్స్, వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్టు నిర్ధారించారు.
మద్యంమత్తులో వాహనాన్ని అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ బాలాజీకి వివాహమై ఓ పాప ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.