యురేకా బ్లాక్ లాంచ్: ధర ఎంత?
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిది. యురేకా బ్లాక్ పేరుతో బదీన్ని గురువారం భారతదేశంలో విడుదల చేసింది. 2015 లో యురేకా తొలి డివైస్‌లను లాంచ్ చేసిన యు యురేకాకు సక్సెసర్దీన్ని లాంచ్ చేసింది. దీని ధరను. రూ .8,999 గా నిర్ణయించింది. యూ యురేకా బ్లాక్ జూన్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది.
యు యురేకా బ్లాక్ ఫీచర్లు
5 అంగుళాల స్క్రీన్
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ మార్షమల్లౌ
4జీబీ డీడీఆర్3 ర్యామ్,
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 దాకా విస్తరించుకునే సదుపాయం
13ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపి సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000ఎంఏహెచ్ బ్యాటరీ
18-25 ఏళ్ల మధ్య వయసున్న యూత్ అందుబాటులోఉండేలా రూ.10వేల లోపు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. ఈ కేటగిరీ ఫోన్ల ఫీచర్లన్నీ దాదాపు ఒకే లా ఉంటాయని వారు భావిస్తారనీ, వారి నమ్మకానికి అనుగుణంగా యురేకా బ్లాక్‌ను లాంచ్ చేసినట్టు మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ చీఫ్ మార్కెటింగ్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ తెలిపారు.