పండ్ల రేటు విషయంలో ఘర్షణ: ఒకరి మృతి
భైంసా (ఆదిలాబాద్): ఇద్దరు చిరు వ్యాపారుల మధ్య పండ్లు అమ్మే విషయంలో తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. భైంసాకు చెందిన మహ్మద్ ఫారూక్, జలీల్, షేక్ మహ్మద్‌లు, మార్కెట్ సెంటర్లో పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం పండ్ల రేటు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
దీంతో జలీల్, ఫారూక్‌లు ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. జలీల్‌కు సన్నిహితుడైన షేక్ మహ్మద్ కూడా ఫారూక్ పై దాడి చేశాడు. దీంతో ఫారూక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఫారూక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.