జీ సినీ అవార్డుల విజేతలు వీరే..
హైదరాబాద్ : జీ సినీ తెలుగు అవార్డుల వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను ఈ అవార్డుల ప్రధానం జరిగింది. సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా చిరంజీవి, మజిలీ, ఓ బేబీ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సమంత అవార్డులు దక్కించుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ట్విటర్ స్టార్ అవార్డు దక్కింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. మెగాస్టార్ కుమార్తె సుష్మిత సైరా చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు అందుకున్నారు. అలాగే కళాతపస్వీ కె విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి, కె విశ్వనాథ్, సమంత, భూమిక, శ్రద్దా శ్రీనాథ్, నిధి అగర్వాల్, రత్నవేలు పూజా హెగ్డే, రామ్, పూరి జగన్నాథ్, ఛార్మి, కార్తికేయ, నందినిరెడ్డి, ఖుష్బూ, జయప్రద, రెజీనా, నవీన్ పొలిశెట్టి, అనసూయ తదితరులు హాజరయ్యారు.
జీ సినీ అవార్డుల విజేతలు..
ఉత్తమ నటుడు : చిరంజీవి(సైరా నరసింహారెడ్డి)
ఉత్తమ నటి : సమంత(మజిలీ, ఓ బేబీ)
బెస్ట్ ఫైన్డ్ ఆఫ్ ది ఇయర్ : శ్రద్ధా శ్రీనాథ్(జెర్సీ)
ఉత్తమ సహాయ నటుడు : అల్లరి నరేష్(మహర్షి)
ఉత్తమ హాస్యనటుడు : రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి(బ్రోచేవారెవరురా)
ఫెవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ : నాని(జెర్సీ)
ఫెవరెట్ నటి : పూజా హెగ్డే (మహర్షి)
ఉత్తమ నిర్మాత : ఛార్మి(ఇస్మార్ట్ శంకర్)
సన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ : రామ్ (ఇస్మార్ట్ శంకర్)
బెస్ట్ సన్సేషన్ డైరక్టర్ : పూరి జగన్నాథ్(ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ సంగీత దర్శకుడు : మణిశర్మ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్ (కడలల్లే.. డియర్ కామ్రేడ్ )
ఫేవరెట్ అల్బమ్ ఆఫ్ ది ఇయర్ : జస్టిన్ ప్రభాకరన్(డియర్ కామ్రేడ్)
ఉత్తమ విలన్ : తిరువీ(జార్జిరెడ్డి)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే : వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)
ఉత్తమ నూతన నటి : శివాత్మిక రాజశేఖర్( దొరసాని)
ఉత్తమ నూతన నటుడు : ఆనంద్ దేవరకొండ(దొరసాని)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు(సైరా)
న్యూ సన్సేషన్ ఆఫ్ ది ఇయర్ : తరుణ్ భాస్కర్ (మీకు మాత్రమే చెప్తా)
ఉత్తమ గాయని : చిన్నయి (ప్రియతమా.. మజిలీ)
ఫేవరెట్ డెబ్యూ డైరక్టర్ : స్వరూప్ ఆర్ఎస్జే(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఫేవరెట్ సపోర్టింగ్ యాక్టర్ : నీల్ నితీశ్ ముఖేష్(సాహో)