Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Rekha Gupta Named Next Delhi CM, Parvesh Verma To Be Deputy1
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా

ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఉత్కంఠతకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్‌ వర్మ, స్పీకర్‌గా విజేందర్‌ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్‌ ధన్‌ఖడ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్‌ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్‌ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్‌ అధినేత,మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

YS Jagan Fire On Chandrababu Govt After Mirchi Yard Visit2
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.నినాదాలతో జగన్‌ ప్రసంగానికి అంతరాయంజగన్‌ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్‌ బయటకు వచ్చిన వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Tdp Leaders Attempt To Conspiratorially Implicate Vallabhaneni Vamsi In Case3
వల్లభనేని వంశీ కేసులో అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు

సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్‌ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్‌ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్‌గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్‌ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్‌మీట్‌ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.కస్టడీ పిటిషన్‌పై విచారణకాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో వంశీ పేర్కొన్నారు.వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్‌లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

KCR BRS Party Key Meeting At Telangana Bhavan Feb 19th Live Updates4
బీఆర్‌ఎస్‌ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్‌

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్‌ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) సిల్వర్‌ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్‌ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్‌ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్‌ నేత హరీష్‌ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్‌ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్‌ఎస్‌.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్‌ఎస్‌ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్‌ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్‌ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్‌ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్‌ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌అంతకు ముందు .. కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్‌ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్‌ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు.

Will Young, Tom Latham Hits Tons, New Zealand Post Big Total 5
లాథమ్‌, యంగ్‌​ సెంచరీలు.. పాక్‌ ముందు భారీ టార్గెట్‌?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో కరాచీ వేదిక‌గా పాకిస్తాన్‌(Pakistan)తో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 316 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్‌, టామ్ లాథ‌మ్ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెలరేగారు.73 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను లాథమ్‌, యంగ్ త‌మ అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెలకొల్పారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన ఈ కివీ ద్వయం.. క్రీజులో సెటిల్ అయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్‌ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే(10), డార్లీ మిచెల్‌(10), విలియమ్సన్‌(1) విఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్‌, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్‌​ పడగొట్టారు.అఫ్రిదిని ఉతికారేశారు..తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులిచ్చి వికెట్‌ ఏమీ సాధించలేకపోయాడు. గాయం నుంచి తిరిగి వచ్చాక అఫ్రిది తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్‌లో పేస్‌ కూడా తగ్గింది. అంతేకాకుండా బంతిని స్వింగ్‌ చేయడంలో కూడా అఫ్రిది విఫలమవుతున్నాడు. మరోవైపు హ్యారీస్‌ రౌఫ్‌ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.తుది జట్లుపాకిస్తాన్‌ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: PAK vs NZ: అత‌డెందుకు దండగ అన్నారు.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ సెంచ‌రీ

Bollywood actress Swara Bhasker Contraversey Tweet On Chhaava Movie6
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్‌పై ఓ రేంజ్‌లో నెటిజన్స్ ఫైర్!

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ చేసిన ట్వీట్స్‌ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్‌ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ ‍చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్‌ చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్‌ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్‌ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్‌ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్‌ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్‌పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్‌.. ఫహాద్‌ ఆహ్మద్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025

Telangana Government Key Decision on LRS7
ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

సాక్షి,హైదరాబాద్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

LIC Introduces Smart Pension Plan And Details8
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌కు.. మార్కెట్‌తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్‌ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025

Ap High Court Key Comments On Establishment Of A Bench In Kurnool9
కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్‌ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్‌ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్‌ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్‌ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్‌ను పెండింగ్‌లో పెట్టాలని పిటిషనర్‌ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది.

YouTube Village turning content into cash and change one video at a time in Chhattisgarh viral10
కంటెంట్‌ క్వీన్స్‌ మ్యాజిక్‌ : ‘యూట్యూబ్‌ విలేజ్‌’ వైరల్‌ స్టోరీ

ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్‌ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్‌ కింగ్‌లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్‌ స్కిట్‌లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్‌, స్టడీ, కామెడీ వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్‌ సమస్యలు,కాపీ రైట్‌ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్‌ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్‌లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్‌ చేసిన వాల్‌మార్ట్‌

పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు.

title
ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ట్రంప్‌ ఆగ్రహం !

వాషింగ్టన్‌:ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్య

title
‘రాజకీయ కారణాలతోనే బైడెన్‌ వారిని వదిలేశారు’

వాషింగ్టన్‌: వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ల

title
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్‌ వివాదాస్పద వీడియో

వాషింగ్టన్‌: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస

title
అఫ్గాన్‌ సరిహద్దుల్లో పాక్‌ ఆపరేషన్‌.. 30మంది ఉగ్రవాదులు హతం

పెషావర్: పాకిస్తాన్‌ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

NRI View all
title
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి

డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్ర‌ముఖ తెలుగు సంఘం 'మన అమెర

title
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు

ఆర్మూర్‌: తెలంగాణ‌ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్‌ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్‌ (Israel)

title
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)  దశాబ్ద వేడుకలు డిసెంబర్‌లో జరగనున్నాయి.

title
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక

డల్లాస్‌: మాట (మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) బోర్డు మీటిం

title
ప్రధాని మోదీతో మస్క్‌-శివోన్‌ పిల్లల అల్లరి

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో

Advertisement

వీడియోలు

Advertisement