సాక్షి, గుంటూరు: పల్నాడు మాచర్లలో వరికపూడిశెల ప్రాజెక్టు శంకుస్థాపన ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరిగింది. దీనిపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. పల్నాడు రూపురేఖలు మార్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినందుకు సంతోషంగా ఉందని భావోద్వేగపూరిత సందేశం ఉంచారాయన.
‘‘పుట్టిన బిడ్డకు అందని తల్లిపాల మాదిరిగానే.. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా పల్నాడు ప్రాంతానికి నీరు దక్కని పరిస్థితి. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఈ దుర్భర పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. అందుకే పల్నాడు రూపురేఖలు పూర్తిగా మార్చాలనే తపన, తాపత్రయంతో.. ఈ రోజు రూ.340.26 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా..కృష్ణా జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేశాను అని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని ట్వీట్ ద్వారా తెలిపారాయన.
పుట్టిన బిడ్డకు అందని తల్లిపాల మాదిరిగానే.. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా పల్నాడు ప్రాంతానికి నీరు దక్కని పరిస్థితి. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఈ దుర్భర పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. అందుకే పల్నాడు రూపురేఖలు పూర్తిగా మార్చాలనే తపన, తాపత్రయంతో ఈ రోజు రూ.340.26 కోట్లతో… pic.twitter.com/WjtOr1OllY
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2023
ఇదీ చదవండి: మోసాల చరిత్ర.. చంద్రబాబును నమ్మగలమా?
Comments
Please login to add a commentAdd a comment