ఆ కేసు త్వరలో సుఖాంతం
హుబ్లీ: సీటీ రవి, లక్ష్మీద హెబ్బాళ్కర్ కేసు త్వరలో పరిష్కారం అవుతుందని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి తెలిపారు. గురువారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ సీటీ రవి, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ జగడం వ్యవహారం పరిషత్ విషయ నీతి నిరూపణ సమితికి పంపించాం. ఇంకా అక్కడి నుంచి నివేదిక వివరాలు అందలేదు. వీలైనంత త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పార్టీల 8 మంది సభ్యులతో కూడిన సమితి ఏర్పాటైందన్నారు. ఆ సమితి త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఏదేమైనా కేసును పరిష్కరించే బాధ్యత తనపై ఉందన్నారు. త్వరలోనే పరిష్కరించే అవకాశం ఉందన్నారు. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసును సుఖాంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేసుకు సంబంధించి అత్యధికంగా గడువు మేరకు అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించవచ్చన్నారు. కేసుపై మాట్లాడేందుకు ఇటీవల మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌కు రెండు సార్లు ఫోన్ చేశాను. అయితే ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదన్న రుజువులు కూడా ఆయన ఫోన్‌లో మీడియా ప్రతినిధులకు చూపించారు. కొన్ని సార్లు ఎమోషన్ అయినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ అయితే వాటిని అక్కడే పరిష్కరించేవాడిని, ఏదేమైనా కానీ ఈ కేసును ముగించాలి. ఎందుకంటే దీని చరిత్ర అలాగే ఉండిపోతుంది. ఈ కేసు మంచి ముగింపుతో పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment