అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

Jun 25 2024 1:52 AM | Updated on Jun 25 2024 1:52 AM

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

నారాయణపేట: కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని లోకల్‌బాడీ అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కొడంగల్‌ నియోజక వర్గ అభివృద్ధి నిర్మాణ పనులపై పిఆర్‌, ఆర్‌అండ్‌బి, మిషన్‌ భగీరథ ఈఈలతో సమీక్షించారు. కోస్గి, మద్దూరు, గుండుమల్‌, కొత్తపల్లి మండలాలాఓ్ల ప్రతిపాదించిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని, ఇప్పటివరకు మద్దూరు, కోస్గి మండలాల్లోని అన్ని గ్రామాలకు ఉన్న రోడ్ల పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తూ ఒకవేళ రోడ్డు లేని చోట కొత్తగా రోడ్లు వేయాలన్నారు. కొత్తవాటికి ప్రతిపాదనలు పంపాలన్నారు. మద్దూరు, కోస్గి, గుండుమల్‌, కొత్తపల్లి మండలాల నుంచి కొత్తగా వేసే సింగిల్‌ లైన్‌, డబుల్‌ లైన్‌ రోడ్ల పనులకు టెండర్లు ముగిశాయని, అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ ఈఈ రాములు తెలపగా.. త్వరగా అగ్రిమెంట్‌ చేసి పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. మద్దూరులోనూ రోడ్డు విస్తరణ పనులకు అగ్రిమెంట్‌ చేయించాలన్నారు. ఇంకా ఎక్కడైనా రోడ్ల నిర్మాణం అవసరమైతే ప్రతిపాదనలు చేసి పంపించాలని సూచించారు. రెండు మండలాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు పూర్తయిన వాటిలో పది పాఠశాలలను ఎంపిక చేసి రంగులు వేయించాలని చెప్పారు. అలాగే, మిషన్‌ భగీరథ తాగునీటి పథకానికి సంబంధించి తాగునీటి సరఫరాను మెరుగు పర్చాలన్నారు. పంచాయతీరాజ్‌ ఈఈ హిర్యా నాయక్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రాములు, డీఈఓ అబ్దుల్‌ ఘని, మిషన్‌ భగీరథ ఈఈలు వెంకట్‌ రెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement